AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: నా వాడంటే నా వాడంటూ.. సీఐ కోసం ఎస్పీ కార్యాలయంలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు..

గుంటూరు ఎస్పీ కార్యాయలం ఫిర్యాదుదారులతో కిటకిటలాడుతోంది. సోమవారం కావడంతో గ్రీవెన్స్ కార్యక్రమానికి అనేక మంది క్యూ కట్టారు. ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఇంతలోనే ఫిర్యాదు దారులు వేచి ఉన్న ప్రాంతంలో కలకలం రేగింది. ఇద్దరూ మహిళలు ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటున్నారు.. ఇంతలోనే..

Andhra News: నా వాడంటే నా వాడంటూ.. సీఐ కోసం ఎస్పీ కార్యాలయంలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు..
Guntur Sp Office
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 29, 2025 | 1:37 PM

Share

గుంటూరు ఎస్పీ కార్యాయలం ఫిర్యాదుదారులతో కిటకిటలాడుతోంది. సోమవారం కావడంతో గ్రీవెన్స్ కార్యక్రమానికి అనేక మంది క్యూ కట్టారు. ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఇంతలోనే ఫిర్యాదు దారులు వేచి ఉన్న ప్రాంతంలో కలకలం రేగింది. ఇద్దరూ మహిళలు ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటున్నారు. ఇద్దరి మధ్య తీవ్రమైన పెనుగులాట జరుగుతుండటతో అప్రమత్తమైన మహిళా కానిస్టేబుళ్లు వెంటనే వారిని కట్టడి చేసి విడదీశారు. ఒకరి నొకరు కలుసుకోకుండా పక్కకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అసలు ఎందుకు కొట్టుకుంటున్నారా అని ఆరా తీశారు. వారిద్దరి సమాధానం విన్న మహిళా కానిస్టేబుళ్లే కాదు ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యపోయారు.

నగరంలో పనిచేసే ఒక సిఐ నల్లపాడుకు చెందిన మహిళతో కొంతకాలం పాటు సన్నిహితంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుండగానే ఆ సిఐ సచివాలయంలో పనిచేసే మరొక మహిళతో కూడా స్నేహం చేయడం ప్రారంభించాడు. అయితే ఈ విషయం నల్లపాడుకు చెందిన మహిళకు తెలిసింది. తనతో సన్నిహితంగానే ఉంటూ సచివాలయం ఉద్యోగితో మరింత సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయింది. ఇంకేముంది వెంటనే గ్రీవెన్స్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చేరవేసేందుకు సిద్దమైంది. సిఐ అతని సచివాలయ స్నేహితురాలిపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చింది.

వీడియో చూడండి..

ఈ విషయం వెంటనే సచివాలయం ఉద్యోగికి కూడా తెలిసింది. ఆమె కూడా ఎస్పీకి నల్లపాడుకు చెందిన మహిళపై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఇద్దరూ గ్రీవెన్స్ జరుగుతున్న ప్రాంతం వద్ద వేచి ఉన్నారు. ఆ తర్వాత ఒకరికొకరు ఎదురు పడటంతోనే మాట మాట పెరిగింది. మాటల యుద్దం దాటి ఇద్దరూ చేతల్లోకి దిగారు. కొట్టుకున్నారు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకోవడడంతో ఘర్షణ ఆగింది.

ఆ తర్వాత నల్లపాడుకు చెందిన మహిళ సచివాలయ ఉద్యోగితో పాటు సిఐపై కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఆ వెనువెంటనే సచివాలయ ఉద్యోగిని.. నల్లపాడుకు చెందిన మహిళపై వ్యభిచారం కేసు కూడా ఉందని ఆ కేసులో శిక్ష కూడా పడిందని తనను వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించగా అందుకు ఒప్పుకోకపోవడంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒక సిఐ కోసం భార్యలు కాని ఇద్దరూ మహిళలు ఏకంగా ఎస్పీ కార్యాయలంలోనే కొట్టుకోవడంతో పెద్ద కలకలమే రేగింది. పోలీస్ శాఖ పరువుపోయే అంశం కావడంతో వెంటనే ఇద్దరూ మహిళలకు నచ్చజెప్పి అక్కడ నుండి పంపించి వేశారు. అయితే, ఆ మహిళలు ఆ తర్వాత వచ్చి తామిచ్చిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడంతో పోలీసులకు పెద్ద తలనొప్పి తప్పింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..