Goutham Reddy: డ్రోన్‌తో గౌతమ్ రెడ్డికి పూలమాల.. ఆత్మకూరులో మంత్రికి వైసీపీ నేతల వినూత్న స్వాగతం
కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి గౌతమ్ రెడ్డికి వినూత్నరీతిలో స్వాగతం పలికారు వైస్సార్సీపీ నేతలు

Goutham Reddy
Goutham Reddy: కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి గౌతమ్ రెడ్డికి వినూత్నరీతిలో స్వాగతం పలికారు వైస్సార్సీపీ నేతలు. ఆత్మకూరులోని ఏ.ఎస్.పేట క్రాస్ రోడ్డు దగ్గర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి డ్రోన్ సహాయంతో పూలమాలను అలంకరించి ఘనంగా సత్కరించారు ఏ.ఎస్ పేట జడ్పీటీసీ సభ్యురాలు పందిళ్ళపల్లి రాజేశ్వరమ్మ, ఏ.ఎస్. పేట మండల కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ సంధాని భాష, ఇతర వైసీపీ నాయకులు.
ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి వైసీపీ నేతలు, ఆత్మకూరు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండి తీరుస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, మరిన్ని భవిష్యత్ లో చేయబోతున్నామని మంత్రి తెలిపారు.