AP News: ద్వారకా తిరుమల వెళ్తున్నారా.? మీకో సూపర్ గుడ్‌న్యూస్.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు
చిన్న తిరుపతిగా వెలుగొందింది ద్వారకా తిరుమల. మీరూ ద్వారకా తిరుమల వెళ్తున్నారా.? అయితే మీకో సూపర్ గుడ్ న్యూస్. తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.. లేట్ ఎందుకు ఓ లుక్కేయండి.
![AP News: ద్వారకా తిరుమల వెళ్తున్నారా.? మీకో సూపర్ గుడ్‌న్యూస్.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/representative-imnage.jpg?w=1280)
మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక చింతనకు ఆలయాలు నిలయాలుగా మారుతున్నాయి. ఆలయాల పరిరక్షణతో పాటు సనాతన ధర్మ విశిష్టతలు తెలిసేలా ఆలయాలలో ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయాలలో దైవదర్శనానికి వస్తున్న భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ ఉత్తర్వులతో దేవాదాయ శాఖ అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటుంది. నిత్యం వేలాదిమంది భక్తులు రాష్ట్రంలో వివిధ ఆలయాలకు వెళ్లి తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఆలయాలకు వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయంపై సర్వే చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ఆలయాలలో ప్రస్తుత సాంకేతిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి దాని ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దేవుడు ప్రముఖ దేవాలయాలైన ద్వారకాతిరుమల, విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయాలలో భక్తులు దర్శనానికి వచ్చిన ప్రదేశాలలో అక్కడక్కడ వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలోనీ ప్రొటోకాల్ కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం కౌంటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ల ద్వారా ఆలయ దర్శనంపై సర్వే నిర్వహిస్తున్నారు.
స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు దర్శనానంతరం తమ అభిప్రాయాలను దేవదాయశాఖకు తెలియజేయాలనుకునే భక్తులు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, అందులోని గూగుల్ లెన్స్ తో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తరువాత ఆలయ దర్శనంపై సర్వే పేరుతో ఒక ఫాం ఓపెన్ అవుతుంది. అందులో మీ దర్శనం యొక్క అనుభవం ఎలా ఉంది? బాగుందా.. లేదా.. దేవాలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్ రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు పెట్టే స్థలం పై మీ అభిప్రాయం? బాగుందా, లేదా.. దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా, లేదా.. ప్రసాదం తాజాగా రుచిగా ఉందా, లేదా.. అనే అభిప్రాయాలను తెలిపి, భక్తుడి పూర్తి వివరాలను అందులో తెలియజేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన భక్తుడి అభిప్రాయాలు దేవాదాయ శాఖ అధికారులకు చేరతారు. అలా వచ్చిన అభిప్రాయాలను ఆలయాల్లో జరిగే లోపాలు గాని, ఏయే కార్యక్రమాల పట్ల భక్తులు ఆనందంగా ఉన్నారు, ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారు అనే విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి