Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: ఏకంగా సీబీఐ నుంచి ఫోన్ కాల్.. డౌట్ వచ్చి.. లిఫ్ట్ చేయగా సీన్ సితారయ్యింది

డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తున్న ముఠా ఆట కట్టించారు తిరుపతి జిల్లా పోలీసులు. రూ. 2.5 కోట్లు దోచుకున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఆరుగుర్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ 32.5 లక్షల నగదు, రూ.10 లక్షలు విలువచేసే 141 గ్రాముల బంగారు, 8 సెల్ ఫోన్‌లు, 2 ల్యాప్‌టాప్‌తో పాటు సిమ్ మోడ్యూల్స్, 8 రూటర్లు, నిందితుడి అకౌంట్‌లోని బాధితురాలికి చెందిన రూ 10 లక్షల నగదు ఫ్రీజ్ చేశారు పోలీసులు.

Tirupati: ఏకంగా సీబీఐ నుంచి ఫోన్ కాల్.. డౌట్ వచ్చి.. లిఫ్ట్ చేయగా సీన్ సితారయ్యింది
Representative Image
Follow us
Raju M P R

| Edited By: Ravi Kiran

Updated on: Jan 29, 2025 | 8:25 PM

ముంబై క్రైమ్ పోలీసులమని, సీబీఐ అధికారులమంటూ ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. హై ప్రొఫైల్ వ్యక్తులతో పాటు సాధారణ వ్యక్తులను టార్గెట్ చేసి డబ్బులు కొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఎట్టకేలకు అడ్డంగా దొరికిపోయారు. తిరుపతికి చెందిన 65 ఏళ్ల మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్, వాట్సాప్ వీడియో కాల్స్ చేసి, ఢిల్లీ సీబీఐ అధికారులమని రూ 200 కోట్లు మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. బాధితరాలు పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని భయభ్రాంతులకు గురి చేసారు. వివిధ అకౌంట్లకు నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తే వాటిని పరిశీలించి సదరు డబ్బులు మనీలాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే రిలీజ్ చేస్తామని మాయ మాటలు చెప్పారు. ఇలా నమ్మించి ఆమె వద్ద నుంచి రూ 2.5 కోట్లు నగదును వివిధ అకౌంట్లలో జమ చేసుకున్న కేటుగాళ్లు ఆ తర్వాత స్పందించకపోవడంతో సైబర్ నేరం జరిగినట్లు బాధిత మహిళ గుర్తించారు. ఈ మేరకు ఈ నెల 13న తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటికే ఈ కేసులో రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ని అరెస్ట్ చేసి రూ 24.5 లక్షల నగదు, ఒక XUV 700 కారు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్‌లు, 16 గ్రాములు బంగారంతో పాటు సాంకేతికంగా ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అతని అకౌంట్లలో ఉన్న బాధిత మహిళకు చెందిన రూ 26 లక్షల నగదు లావాదేవీలను ఫ్రీజ్ చేసారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరింత పురోగతి సాధించిన పోలీసులు బుధవారం ఆరుగుర్ని అరెస్ట్ చేసారు. మరో రూ 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్‌లు, 2 ల్యాప్‌టాప్, ఒక సిమ్ మొడ్యుల్స్, 8 రూటర్లు అకౌంట్‌లలో ఉన్న బాధితురాలి డబ్బు రూ 10 లక్షల నగదు ఫ్రీజ్ చేసారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో సీబీఐ అధికారులుగా అవతారం ఎత్తి అడ్డంగా బుక్ అయ్యారు. మీడియేటర్ సహాయంతో కంబోడియాకు వెళ్ళి అక్కడ కస్టమర్ సపోర్ట్‌గా పని చేస్తూ, టెక్నాలజీ ఉపయోగించి సైబర్ క్రైమ్‌పై అవగాహన పెంచుకున్న విశాఖపట్నంకు చెందిన ముఠా సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

విశాఖపట్నంలో ఒక రూమ్‌ను అద్దెకు తీసుకుని సైబర్ నేరానికి ఉపయోగపడేలా ఏర్పాట్లు చేసుకుని ఈ తతంగం నడిపించారు. సిమ్ మోడ్యూల్, రూటర్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటిదాకా ఈ కేసులో ఈ నెల 21న ఒకర్ని, బుధవారం మరో 6 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు రూ.57 లక్షల నగదు, రూ 38 లక్షల విలువ చేసే బంగారం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న బాధిత మహిళకు చెందిన రూ 36 లక్షల నగదును కూడా ఫ్రీజ్ చేసారు. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టుల కేసుల సంఖ్య పెరుగుతూ ఉందన్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. తెలియని నెంబర్ల నుంచి వాట్సప్ వీడియో కాల్స్ వస్తే స్పందించవద్దన్నారు ఎస్పీ. సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదంటే 112, తిరుపతి పోలీసు వాట్సాప్ నెంబర్ 80999 99977కు ఫోన్ చేసి సాయం పొందాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా
కాసులు కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. లక్షతో కోటీశ్వరులుగా
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవి? మంత్రి సమాధానం!
గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి
గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రి
ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?
ఆపిల్ నుంచి మరో అతిచౌకైన ఐఫోన్.. భారత్‌, అమెరికా, దుబాయ్‌లో ధరలు?
ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా విచిత్ర అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..
పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
పెరిగిన మారుతీ డిజైర్ కారు ధర.. ఏ వేరియంట్ కు ఎంతో తెలుసా..?
ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!
ప్రియమణి అక్క ఇండస్ట్రీలో తోపు హీరోయినా..!
ఆ విషయంలో వెనక్కి తగ్గిన BCCI
ఆ విషయంలో వెనక్కి తగ్గిన BCCI
పెళ్లిలో మొత్తం కట్నం డబ్బు తిరిగిచ్చేసిన వరుడు.. షాకైన అతిథులు!
పెళ్లిలో మొత్తం కట్నం డబ్బు తిరిగిచ్చేసిన వరుడు.. షాకైన అతిథులు!