AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్.. కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..

ఏపీలో కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం అర్హత పరిశీలన, భౌతిక వెరిఫికేషన్, బడ్జెట్ ప్రతిపాదనలు చేపట్టి, ప్రభుత్వ ఆమోదం తర్వాత అర్హులకు దశలవారీగా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. 28 కేటగిరీలకు ఈ పథకం వర్తించనుంది.

గుడ్‌న్యూస్.. కొత్త పెన్షన్లకు పచ్చజెండా.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..
Ap Ntr Bharosa Pension
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Sep 06, 2026 | 8:44 PM

Share

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరుకు ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు స్థాయిలోనే కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించేలా ప్రభుత్వం ప్రక్రియను సిద్ధం చేసింది. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నవారు ఇక దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నారు.. అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుని తదుపరి పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు.

అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే పెన్షన్ మంజూరు కాదు.. ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అధికారులు పరిశీలించనున్నారు. వివిధ పెన్షన్ కేటగిరీలకు సంబంధించి అర్హతలను నిర్ధారించిన తర్వాత కేటగిరీల వారీగా దశలవారీగా కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. కొత్త పెన్షన్ దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి అర్హతల పరిశీలన, వెరిఫికేషన్, ప్రాసెసింగ్, చివరకు పెన్షన్ మంజూరు వరకు పూర్తి ప్రక్రియకు నిర్దిష్ట కాలపరిమితులు విధించింది.. దీంతో దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

కొత్త పెన్షన్ దరఖాస్తులను జిల్లా స్థాయిలోనూ నిశితంగా పరిశీలించనున్నారు.. సంబంధిత శాఖల జిల్లా అధికారులు దరఖాస్తుల వెరిఫికేషన్, ప్రాసెసింగ్‌తో పాటు అవసరమైన రాష్ట్రస్థాయి పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా, నిర్ణీత కాలపరిమితిలో వాటిని పరిష్కరించేలా చూడాలని ఆదేశించింది.. ఇందుకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేసింది.

మొత్తంగా.. కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కీలకంగా మారింది.. ఇక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు స్థాయిలో దరఖాస్తుల స్వీకరణకు మార్గం సుగమమైంది.. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, నిబంధనల ప్రకారం పరిశీలన పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ దశలవారీగా కొనసాగనుంది.

కొత్త పెన్షన్ ల షెడ్యూల్ ఇదే..

సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పెన్షన్ ల కోసం దరఖాస్తుల స్వీకరణ

సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు కొత్త పెన్షన్ దరఖాస్తుల సాధారణ అర్హత పరిశీలన

22 నుంచి 24 వరకు భౌతిక, శాఖాపరమైన వెరిఫికేషన్

సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కొత్త పెన్షన్లకు బడ్జెట్ ప్రతిపాదనలు

ప్రభుత్వ ఆమోదం తర్వాత అర్హులకు దశలవారీగా మంజూరు

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు 28 రకాల కేటగిరీలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

ప్రత్యేక ధృవపత్రాల నిబంధనలు కూడా అమలు చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us