సబ్జా గింజలు రోజుకు ఎన్ని తింటున్నారు.. ఇంతకు మించి తీసుకున్నారంటే..
Jyothi Gadda
27 September 2026
సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల వేసవిలో శరీరం చల్లబడుతుంది, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.
సబ్జా గింజల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
నీటిలో నా నిన సబ్జా గింజలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీనివల్ల ఆకలి తగ్గి, అనవసరమైన ఆహారం తీసుకోకుండా కేలరీలను అదుపు చేసి బరువు తగ్గవచ్చు.
సబ్జాలో ఉండే పోషకాలు శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల టైప్-2 మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.
సబ్జా గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఆంటిఆక్సిడెంట్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి, ఇవి ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తాయి.
సబ్జా గింజలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా నివారిస్తాయి.
సబ్జా గింజలను పరిమితికి మించి తీసుకుంటే కడుపు ఉబ్బరం, వికారం, కడుపునొప్పి రావచ్చు. సరిగ్గా నానబెట్టకుండా తింటే గొంతులో అడ్డుపడే లేదా మింగడంలో ప్రమాదం ఉంటుంది.