మత్తెక్కిస్తున్న  ఈషా రెబ్బా .. ఫోటోలు అదుర్స్ 

27 September  2026

Rajeev 

Pic credit - Instagram

తెలుగు చిత్ర పరిశ్రమలో అందంతో పాటు సహజమైన నటనకు ప్రాధాన్యం ఇచ్చే అందాల భామల్లో ఈషా రెబ్బా ఒకరు.

కమర్షియల్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం పరుగులు పెట్టకుండా.. తనకు నచ్చిన కథలు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆమె ప్రయాణాన్ని గమనిస్తే.. ప్రతి సినిమాతోనూ కొత్తగా కనిపించాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

2026లోనూ ఈషా రెబ్బా పేరు మరోసారి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ‘ఓం శాంతి శాంతిః’ సినిమాతో ఆమె చేసిన పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌కు జోడీగా కనిపించిన ఈషా.. ఇంతకుముందు చేయని తరహాలో ఒక పాత్రను పోషించానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఈ అందాల భామ చూడచక్కని రూపం, ఆకట్టుకునే అభినయం ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది. 

ఇక సోషల్ మీడియాలో ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.