Good Morning CM Sir: రెండోరోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్‌.. రాజమండ్రిలో గుంతలు పడ్డ రోడ్ల వద్ద నాగబాబు నిరసన

డిజిటల్ క్యాంపెన్ లో రెండు రోజున రాజమండ్రిలో గుంతలు పడ్డ రోడ్ల వద్ద జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు, పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపాయి.

Good Morning CM Sir: రెండోరోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్‌.. రాజమండ్రిలో గుంతలు పడ్డ రోడ్ల వద్ద నాగబాబు నిరసన
Good Morning Cm Sir Nagabab
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jul 16, 2022 | 1:34 PM

Good Morning CM Sir: వైసీపీ ప్రభుత్వ పనితీరు పై జనసేన పార్టీ నిరసన గళం వినిపిస్తోంది. ఏపీలోని ర‌హ‌దారులు అధ్వానంగా మార‌డంపై “గుడ్ మార్నింగ్ సీఎం సార్” పేరుతో  చేపట్టిన డిజిటల్ క్యాంపెన్ నేడు రెండో రోజుకు చేరుకుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రారంభించిన మూడు రోజుల క్యాంపెయిన్‌ కు విశేష స్పందన లభిస్తోంది. అధ్వాన రోడ్లకు పార్టీల‌కు అతీతంగా అంద‌రూ బాధితులే. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు వి భిన్న రకాలుగా తమ నిరసన తెలుపుతున్నారు. కొందరు గుంతలు పడ్డ రోడ్లు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా గుంతలు పడ్డ రోడ్లపై గుడ్ మార్ఫింగ్ సీఎం సార్ అంటూ ముగ్గులు వేసి కొందరు.. మొక్కలు నాటి ఇంకొందరు… వారి నాట్లు వేసి.. మోకాళ్ళ నీటి లోతులో దిగి మరికొందరు, ఫ్లకార్డులు పట్టుకొని ఇలా రకరకాలుగా గుంతలు పడ్డ రోడ్లపై గుడ్ మార్నింగ్ సార్ అంటూ తమ నిరసన వ్యక్తం చేశారు.

తాజాగా డిజిటల్ క్యాంపెన్ లో రెండు రోజున రాజమండ్రిలో గుంతలు పడ్డ రోడ్ల వద్ద జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు, పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపాయి. నాగబాబు గుడ్ మార్ఫింగ్ సీఎం సార్ అంటూ ఫ్లకార్డులు కార్డులు పట్టుకుని గుంత‌ల రోడ్డు దుస్థితిని ఆవిష్కరించే వీడియోను ట్విట‌ర్‌లో పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఏపీలోని అధ్వాన రోడ్ల ఫొటోలు, వీడియోల‌ను పోస్టు చేస్తూ 3.55 ల‌క్షల ట్వీట్లు చేశార‌ని జ‌న‌సేన ప్రక‌టించింది. స‌మ‌యం గ‌డిచేకొద్ది ఇది మ‌రింత పెరుగుతూ పోతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles