AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Seized: ట్రావెల్‌ బస్సులో బంగారం, వజ్రాభరణాల తరలింపు.. గుట్టురట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే..?

Gold Diamond jewelry Seized: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అదేవిధంగా సాధారణ తనఖీల్లో పోలీసులు భారీగా డబ్బు, బంగారం స్వాధీనం

Gold Seized: ట్రావెల్‌ బస్సులో బంగారం, వజ్రాభరణాల తరలింపు.. గుట్టురట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే..?
Gold Jewelry Seized
Shaik Madar Saheb
|

Updated on: Apr 14, 2021 | 2:32 PM

Share

Gold Diamond jewelry Seized: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అదేవిధంగా సాధారణ తనఖీల్లో పోలీసులు భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా బంగారం పట్టుబడింది. గట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో తరలిస్తున్న బంగారం, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సులో బంగారం, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు. దీనిలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.04 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను పోలీసులు గుర్తించారు. ఆ సొత్తుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోని సీజ్‌ చేశారు. దీంతోపాటు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ బంగారు వజ్రాభరణాలను హైదరాబాద్‌ నుంచి తమిళనాడులోని మధురై తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వెంటనే ఇద్దరని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ బంగారు అభరణాలు ఎవరికి సంబంధించినవి.. ఈ అక్రమ రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. గత శనివారం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సులో కూడా పెద్ద ఎత్తున బంగారం, నగదు లభించింది. పోలీసులు బస్సును ఆపి తనిఖీ నిర్వహించగా.. అందులో రూ.3 కోట్లకుపైగా నగదు, కిలో బంగారం లభించింది. పట్టుబడిన నగదు చెన్నైలోని ఓ మెడికల్‌ కాలేజీకి చెందినదిగా, బంగారం హైదరబాద్‌లోని ఓ ప్రముఖ జ్యూయలరీ షాప్‌నకు చెందినదిగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Also Read:

Air India: అప్పటికల్లా పూర్తి కానున్న ఎయిర్‌ ఇండియా అమ్మకం.. వడివడిగా అడుగులు.. బిడ్ల ప్రక్రియ ప్రారంభం..!

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే