Wife : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వద్దని ఆరేళ్లుగా చెబుతున్నా వినకపోవడంతో చేసేది లేక, చివరికి..

Wife suicide : భర్త మద్యానికి బానిస కావడంతో మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కర్నూలులో చోటుచేసుకుంది...

  • Venkata Narayana
  • Publish Date - 4:02 pm, Wed, 14 April 21
Wife  : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వద్దని ఆరేళ్లుగా చెబుతున్నా వినకపోవడంతో చేసేది లేక, చివరికి..
Wife N Husband

Wife suicide : భర్త మద్యానికి బానిస కావడంతో మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. పట్టణంలోని బంగారుపేటకు చెందిన భువనేశ్వరి ఆరేళ్ల క్రితం రవీంద్రనాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానిక వెంకట రమణ కాలనీలోని రోడ్-1లో వీరు నివాసముంటున్నారు. రవీంద్రనాథ్ ఓ ప్రైవేటు బీమా సంస్థలో పనిచేస్తున్నాడు. అయితే, భర్త మద్యానికి అలవాటు పడ్డం, రోజూ తాగి రావడంతో భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త రవీంద్రనాథ్ కు ఎన్నిసార్లు చెప్పినా తీరులో మార్పు రాకపోవడంతో భార్య భువనేశ్వరి తీవ్ర మనస్తాపం చెందుతోంది. రోజూలాగే భర్త తాగి వచ్చేసరికి భరించలేక అర్ధరాత్రి పంచెతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది భువనేశ్వరి. సమాచారం అందుకున్న కర్నూలు టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. మృతురాలి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు.. భువనేశ్వరి భర్త రవీంద్రనాథ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Read also : Maharashtra Coronavirus : మహారాష్ట్రలో ఈ రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ తరహా నిబంధనలు, కరోనా కట్టడికి మరాఠా పాట్లు