AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: ఒళ్లో కూర్చోవాలి.. గోవా అమ్మాయిల్లా ప్రవర్తించాలి..  కీచక టీచర్ల వెకిలిచేష్టలు

శ్రీసత్యసాయి జిల్లా తలుపుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అధ్యాపకులు తమను వేధిస్తున్నారని పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కళాశాలలో రెగ్యులర్‌ అధ్యాపకులు ఇద్దరే ఉన్నారు. మిగిలిన....

AP Crime: ఒళ్లో కూర్చోవాలి.. గోవా అమ్మాయిల్లా ప్రవర్తించాలి..  కీచక టీచర్ల వెకిలిచేష్టలు
Student Harassment
Ganesh Mudavath
|

Updated on: Apr 20, 2022 | 5:05 PM

Share

శ్రీసత్యసాయి జిల్లా తలుపుల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అధ్యాపకులు తమను వేధిస్తున్నారని పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కళాశాలలో రెగ్యులర్‌ అధ్యాపకులు ఇద్దరే ఉన్నారు. మిగిలిన వారంతా ఒప్పంద ఉద్యోగులు. వారు ఓ జట్టుగా ఏర్పడి మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, సినిమా డైలాగులతో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతున్నారని సిబ్బంది వాపోయారు. సింగిల్‌ పేరెంట్ ఉన్న విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు అధ్యాపకులు. అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు సేకరించి, మాటలతో దారుణంగా హింసిస్తున్నారు. గోవా బీచ్ లో మజాగా ఉంటుందని, ఒళ్లో కూర్చోవాలంటూ నీచంగా వ్యవహరిస్తున్నారు. రోజూ ఫోన్ లో మాట్లాడాలని, ఉదయం గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్ కచ్చితంగా చెప్పాలని రూల్స్ పెడుతున్నారు. అంతే కాకుండా అమ్మాయిల ముందే అబ్బాయిలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అధ్యాపకుల ఆగడాలను ఇంట్లోవాళ్ల దృష్టికి తీసుకెళ్లే ధైర్యం లేక ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే, పట్టించుకోలేదని విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. మరో అధ్యాపకురాలికి బాధలు చెప్పుకుంటే విద్యార్థినుల వైపు నిలబడ్డారని ఆమెనూ వేధించారని వాపోయారు.

వేధింపులు ఇంకా ఎక్కువ అవడంతో ఇక లాభం లేదనుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాక వారు మరింతగా రెచ్చిపోయారని, ఒప్పంద లెక్చరర్లతో జట్టు కట్టి వేధింపులు తీవ్రం చేశారని ఆవేదన చెందారు. సమస్యను విద్యార్థి సంఘాల నాయకులకు చెబితే వారు తొలుత హడావుడి చేసినప్పటికీ.. ఆ తర్వాత కీచకులతో కలసిపోయారని బాధితులు వివరించారు. రెడ్స్ స్వచ్చంద సంస్థ నిర్వహించిన విద్యార్థినుల అవగాహన కార్యక్రమంలో కామాంధ అధ్యాపకుల లీలలు వెలుగులోకి వచ్చాయి. అధ్యాపకుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రిన్సిపాల్ అన్నారు.

Also Read

Watch Video: లుంగీ డ్యాన్స్‌తో అదరగొట్టిన చెన్నై ఆటగాళ్లు.. కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో రచ్చ మాములుగా లేదుగా..

Infosys : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఆందోళనలో ఉద్యోగులు..

Covid-19: మళ్లీ వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌.. ఢిల్లీ, ముంబాయిల్లో డేంజర్‌ బెల్స్‌..!