ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవుతున్నా సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఆలూరు వైస్ఆర్ సీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం జగన్ కార్యకర్తలకు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఇంకా 19 నెలల సమయం ఉందన్న సీఎం జగన్.. అలసత్వం వద్దని… ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి పార్టీ విజయం కోసం అన్ని ప్రయత్నాలు చెయ్యాలని ఆదేశించారు. అందులో భాగంగానే గత 4 నెలలుగా గడగడపకి అనే కార్యక్రమం పెట్టామని.. అందులో వచ్చిన ఫలితాలు అనుగుణంగా తగిన మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పారు. అందరూ కలిసికట్టుగానే పని చేస్తే విజయం సాధిస్తామని జగన్ కార్యకర్తలకు స్పష్టం చేశారు.
ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. మూడేళ్లలో వైసీపీ చేసిన మంచి కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. ఆలూరులో పలు పథకాల ద్వారా మూడేళ్లలో రూ.1050 కోట్లను అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని.. నిర్వహిస్తున్న పలు బాధ్యతలు, పలు కుటుంబాలకు జరిగిన మేలు గురించి చెప్పాలని సూచించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఆలూరు కార్యకర్తల నుంచి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అభివృద్ధి.. కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..