AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ప్రశాంతి ట్రైన్‌లో అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..

ఓవైపు రైలు కూత.. మరోవైపు మత్తు మోత. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో గంజాయిని గట్టు దాటించబోయారు. గమ్యం ఎక్కడో కానీ పల్నాడులోకి ఎంటర్‌ కాగానే కేటుగాళ్ల ప్లాన్‌ పంక్చరైంది. 2వేల గంజాయి చాకెట్లును సీజ్‌ చేశారు పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. గంజాయి చాక్లెట్లను తరలిస్తోంది అంతర్‌ రాష్ట్ర గ్యాంగ్‌నా లేదంటే లోకల్‌ ముఠానా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Andhra: ప్రశాంతి ట్రైన్‌లో అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
Ganja Chocolates
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2025 | 9:49 AM

Share

ఏపీలో గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు ఎక్సైజ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ నిఘాను పెంచి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ.. గంజాయ్ గ్యాంగ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అయినా.. కాదేది అక్రమ బట్వాడాకు అనర్హం అన్నట్టుగా మత్తు మాఫియా పేట్రేగుతోంది. ఇంతకాలం బైకులు, కార్లు ఇతర వాహనాలతో సప్లై చేసిన కేటుగాళ్లు.. రైలును కూడా అక్రమ రవాణాకు మార్గంగా చేసుకున్నారు.. ఐతే పక్కా సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా పోలీసులు.. ప్రశాంతి ఎక్స్‌ ప్రెస్‌ను ఆపి తనిఖీలు చేశారు. అంతే ఓ బోగిలో గంజాయి గుట్టు గుప్పుమంది. లగేజీని చెక్‌ చేస్తుండగా చాక్లెట్‌ బ్యాగేజీ బయటపడింది. పిప్పరమెంట్లే కాదని లైట్‌గా తీసుకోలేదు పోలీసులు. పరీక్షిస్తే ఇవి మాములు చాక్లెట్లు కాదు గంజాయి సరుకు అని నిర్దారించుకున్నారు. లెక్కేస్తే గంజాయి చాక్లెట్ల కౌంట్‌ దాదాపు 2వేలు పైచిలుకు ఉంది.

Train

Prasanthi Express

ఈ సరుకు ఎక్కడిది? ఎవరు ? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పల్నాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సరుకు దొరికింది. కానీ ఖాకీల రాకను పసిగట్టిన కేటుగాళ్లు.. బ్యాగులను ట్రైన్‌లో సీటు కింద వదిలేసి ప్రశాంతి ఎక్స్‌ ప్రెస్‌ నుంచి పలాయనం చిత్తగించారు. అసలు ట్రైన్‌లోకి ఈ బ్యాగులు ఎవరు తెచ్చారు? ఎక్కడ ట్రైన్‌ ఎక్కారు? వాళ్లు ఎలా వున్నారు? ఏ భాషలో మాట్లాడరు? అంటూ ప్రయాణికుల నుంచి డేటా సేకరించారు పోలీసులు..

Ganja

Ganja

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. గంజాయి చాక్లెట్లను తరలిస్తోంది అంతర్‌ రాష్ట్ర గ్యాంగ్‌నా లేదంటే లోకల్‌ ముఠానా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మత్తు చాక్లెట్లతో పాటు ఖతర్నాక్‌ క్లూ కూడా దొరికినట్టుంది. త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తామన్నారు పల్నాడు పోలీసులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
చిన్న బడ్జెట్ సినిమాలకు 2025 కలిసొచ్చిందా!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. మొత్తం అదే చేసేస్తుంది!
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు