Vizag: ఇంటి సెల్లార్‌లో అనుమానాస్పద మూటలు.. వెళ్లి చేయగా షాక్

నేరగాళ్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అడ్డదారులన్నీ వెతుకుతున్నారు.. ఏదైనా అనుమానం వచ్చి ఇంట్లో వెతికితే అడ్డంగా బుక్ అవుతాము ఏమో అన్న నెపంతో.. ఓ ముగ్గురు యువకులు తమ ఐడియాకు పదును పెట్టారు. గంజాయిని పార్సల్ మూటల్లో చుట్టి సెల్లార్లో గుట్టుగా గంజాయి తరలించేందుకు సిద్ధమైపోయారు.. డీల్ జరిగింది ఎక్కడో తెలుసా జైల్లో..!

Vizag: ఇంటి సెల్లార్‌లో అనుమానాస్పద మూటలు.. వెళ్లి చేయగా షాక్
Vizag
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Jan 03, 2025 | 1:06 PM

విశాఖ లోని పెందుర్తి ప్రాంతం… చిన్నముషిడివాడ లోని వుడా కాలనీ.. ముగ్గురు యువకులు ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. వారిలో ఒకడు ఝార్ఖండ్ కు చెందిన వినయ్ కుమార్ మిశ్రా. మరొకడు ఒడిస్సా కు చెందిన షేక్ జిలాని. ఇంకొకడు యూపీకి చెందిన యోగేంద్ర చౌదరి. వినయ్ కుమార్ మిశ్రా గంజాయి కేసులో అరెస్టై ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు. జైల్లోనే మరొకటితో గంజాయి కోసం మాట్లాడుకున్నాడు. ఒడిస్సా కు చెందిన జైల్లోనే మరొకడు నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిశ్రా వ్యవహారం చెక్కబెట్టేశాడు. ఒడిస్సా నుంచి వచ్చే మాల్ ను రిసీవ్ చేసుకుని హైదరాబాద్ పంపించాలని జైల్లో కుదిరిన డీల్ తో.. అవతలి వ్యక్తికి కాల్ చేశాడు మిశ్రా. ఒడిస్సా నుంచి వచ్చిన గంజాయిని రిసీవ్ చేసుకున్నాడు. మూటలు కట్టి హైదరాబాద్కు తరలించేందుకు సిద్ధమయ్యాడు.

జైలు నుంచి వచ్చిన నిందితులపై పోలీసుల మోనిటరింగ్ పెట్టడంతో.. వారి కదలికలను గుర్తించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న మిశ్రా ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతను నివాసం ఉన్న ప్రాంతానికి వెళ్లారు పోలీసులు.. అక్కడ తరలించడానికి సిద్ధంగా ఉన్న రెండు మూటలు గుర్తించారు. వాటిని విప్పి చూస్తే గంజాయి గొప్ప మంది. మిశ్రా తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించి షేక్ జిలాని, యోగేంద్ర చౌదరిని అరెస్టు చేశారు పోలీసులు. 235 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు పెందుర్తి సీఐ సతీష్. జైల్లో మిశ్రా మరొకటితో డీల్ కుదుర్చుకొని.. గంజాయిని ఒడిస్సా నుంచి రిసీవ్ చేసుకుని హైదరాబాద్కు తరలించేందుకు సిద్ధమైనట్టు.. ఈ లోగా పక్కా సమాచారంతో నిందితులను పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి