AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

silver astrology: వెండి అందరికీ శుభం కాదా..? ఈ రాశులకు వరం.. నియమాలు ఇవే..

silver benefits astrology: జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా శుక్రుడు చెడు స్థితిలో ఉన్నప్పుడు వెండి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం మంచిదని చెబుతారు. అయితే, జ్యోతిష్కులు వెండి అందరికీ శుభం కాదని అంటున్నారు. అందుకే ఇప్పుడు వెండి ధరించడం ఎవరికి మంచిది... ఎవరికి నష్టం చేస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

silver astrology: వెండి అందరికీ శుభం కాదా..? ఈ రాశులకు వరం.. నియమాలు ఇవే..
silver astrology
Rajashekher G
|

Updated on: Feb 01, 2026 | 11:08 AM

Share

హిందూ సంప్రదాయంలో ఆభరణాలు ధరించడం అనేది పూర్వ కాలం నుంచి వస్తోంది. సాధారణంగా బంగారు, వెండి ఆభరణాలను ధరిస్తుంటారు. వీటిని ఆభరణాలుగానే కాకుండా ఆధ్యాత్మికత, జ్యోతిష్య శాస్త్రంలో కూడా పవిత్ర స్థానాన్ని కలిగి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి లోహం ఒక గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. వెండి చంద్రుడు, శుక్రుడిని నేరుగా ప్రభావం చేస్తుంది. చంద్రుడిని మనస్సు, తల్లి, మానసిక శాంతి, చల్లదనానికి కారకంగా పరిగణిస్తారు. అదే సమయంలో శుక్రుడు సంపద, భౌతిక సుఖాలకు అధిపతి. అందుకే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా శుక్రుడు చెడు స్థితిలో ఉన్నప్పుడు వెండి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం మంచిదని చెబుతారు. అయితే, జ్యోతిష్కులు వెండి అందరికీ శుభం కాదని అంటున్నారు. అందుకే ఇప్పుడు వెండి ధరించడం ఎవరికి మంచిది… ఎవరికి నష్టం చేస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వెండి ధరించడం వల్ల కలిగే లాభాలు..

వెండి అందాన్ని పెంచడమే కాకుండా.. దాని ప్రభావం వ్యక్తి వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చంద్రుడు మనసుకు అధిపతి. అందువల్ల వెండి ధరించడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ఒకరి స్వభావంలో సౌమ్యను పెంచుతుంది. వెండి ధరించడం జాతకంలో చంద్రుడు, శుక్రుడి అశుభ స్థానాలకు ఖచ్చితమైన పరిష్కారంగా పరిగణిస్తారు. శుక్రుడిని బలోపేతం చేయడం ద్వారా వెండి సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదాలను నిర్ధారిస్తుంది. ఆయుర్వేద ప్రకారం.. వెండి శరీరంలోని పిత్త రుగ్మతలను సమతుల్యం చేస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది.

వెండి ధరించేందుకు నియమాలు.. ఎవరికి అదృష్టం

వెండి ఉంగరాలు లేదా ఆభణాలు ధరించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వెండి ధరించడం ముఖ్యంగా కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి దృష్టం కలిసి వస్తుంది. శాస్త్రాల ప్రకారం.. పురుషులు కుడి చేతికి వెండి బ్రాస్లెట్ లేదా ఉంగరం, స్త్రీలైతే ఎడమ చేతికి బ్రాస్లెట్ లేదా ఉంగరం ధరించాలి. మీరు ఉంగరం ధరించాలనుకుంటే.. సోమవారంనాడు చిటికెన వేలుకు ధరించడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

శుక్రుని రోజైన శుక్రవారం వెండి ధరించడానికి అత్యంత అనుకూలమైన రోజులుగా పరిగణించబడతాయి. శనివారం వెండిని ఎప్పుడూ ధరించకూడదు. అలాగే మీరు ధరించిన ఉంగరం లేదా బ్లాస్లెట్ ను మరొక వ్యక్తికి ఎప్పుడూ ఇవ్వకండి. ఇది మీ అదృష్టాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అదే విధంగా వెండి కొన్ని రాశులకు సరిపోకపోవచ్చు. అందుకే వారు ముందుగా జ్యోతిష్యుడిని సంప్రదించి వెండి ఆభరణాలను ధరించాలి.

వెండిని ధరించే విధానం

మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన వెండి బ్రాస్లెట్ లేదా ఉంగరం లాంటి ఆభరణాలను నేరుగా ధరించడం కూడదు. వాటిని పవిత్రం చేయాలి. అంటే ఒక గిన్నెలో పచ్చి ఆవు పాలు తీసుకుని అందులో వెండిని శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ‘ఓం సోమాయ నమ:’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ శివుడిని, చంద్రుడిని ధ్యానించండి. వెండిని ధరించేందుకు అత్యంత పవిత్రమైన సమయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)