AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana: లక్ష్మీదేవి, సరస్వతిని దూరం చేసే అలవాట్లు ఇవే.. వెంటనే మానుకోండి!

Garuda Purana teachings: మరణానంతరం జీవితం గురించి మాత్రమే కాకుండా ఆనందం, అదృష్టం రహస్యాలను కూడా గరుడ పురాణం వివరించింది. విష్ణువు ఆయన వాహనం గరుడ పక్షికి మధ్య జరిగిన సంభాషణే గరుడ పురాణం. మరణానంతర జీవితం గురించేగాక, ఉత్తమ జీవన మార్గదర్శకంగా కూడా నిలిచింది.

Garuda Purana: లక్ష్మీదేవి, సరస్వతిని దూరం చేసే అలవాట్లు ఇవే.. వెంటనే మానుకోండి!
Garuda Purana
Rajashekher G
|

Updated on: Jan 31, 2026 | 5:25 PM

Share

సనాతన ధర్మంలోని 18 పురాణాలలో గరుడ పురాణానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. వేదాల తర్వాత అత్యంత పవిత్రంగా ఈ పురాణం భావించబడుతుంది. మరణానంతరం జీవితం గురించి మాత్రమే కాకుండా ఆనందం, అదృష్టం రహస్యాలను కూడా వివరించింది. విష్ణువు ఆయన వాహనం గరుడ పక్షికి మధ్య జరిగిన సంభాషణే గరుడ పురాణం. మరణానంతర జీవితం గురించేగాక, ఉత్తమ జీవన మార్గదర్శకంగా కూడా నిలిచింది. ఆత్మ యొక్క మోక్షాన్ని నిర్ధారించడానికి ఇది సాధారణంగా మరణం తర్వాత పఠిస్తారు. అయితే, వాస్తవానికి ఈ వచనంలో జీవించి ఉన్నప్పుడు ఒక వ్యక్తి విధిని కూడా తెలియజేస్తాయి. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి నుంచి జ్ఞానం, అదృష్టాన్ని దూరం చేసే కొన్ని అలవాట్లు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నీవు ఇచ్చిందే.. తిరిగి వస్తుంది..?

గరుడ పురాణం ప్రాథమిక సూత్రం కర్మ ఫలం. విష్ణువు ప్రకారం.. మానవులు తమ మంచి, చెడు పనుల పరిణామాలను వారి ప్రస్తుత జీవితంలోనే కాకుండా మరణం తర్వాత కూడా అనుభవిస్తారు. మనం చేసే ప్రతి చర్యకు ఒక నిర్దిష్ట పరిణామం ఉంటుందని గుర్తు చేస్తుంది. ఇది మరణానంతరం జీవితాన్ని వివరిస్తూనే.. ధర్మ మార్గాన్ని అనుసరించేందుకు ప్రేరిపిస్తుంది. ఈ సూచనలను పాటిస్తే మనం కష్టాల నుంచి రక్షణ లభిస్తుంది.

జ్ఞానాన్ని, అదృష్టాన్ని దూరం చేసే అలవాట్లు

మురికికి, పేదరికానికి మధ్య సంబంధం.. లక్ష్మీదేవి చంచలమైనది. పరిశుభ్రతను ఇష్టపడుతుంది. గరుడ పురాణం ప్రకారం.. ధనవంతులు అయినప్పటికీ.. మురికి బట్టలు ధరించే లేదా మన చుట్టూ మురికిని ఉంచుకునే వ్యక్తిని లక్ష్మీదేవి వదిలివేస్తుంది. శారీరక, మానసిక స్వచ్ఛత లేకపోవడం సంపదను కోల్పోవడానికి దారితీస్తుంది. అంతేగాకుండా సమాజంలో వ్యక్తి ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

జ్ఞానానికి శత్రువు ఏంటి?..

గరుడ పురాణం.. జ్ఞానం(సరస్వతీ), జ్ఞానం విషయంలో స్థిరమైన అభ్యాసమే విజయానికి కీలకమని స్పష్టం చేస్తుంది. ఒక వ్యక్తి కష్టపడి సంపాదించిన జ్ఞానాన్ని సాధన చేయడం మానేస్తే వారు క్రమంగా దానిని మరిచిపోవడం ప్రారంభిస్తారు. సాధన లేకపోవడం వల్ల ఒక వ్యక్తి జ్ఞానం, నైపుణ్యం కోల్పోతాడు. దీని వల్ల వారు పురోగతి కోసం జరిగే పరుగు పందెంలో వారు వెనుకబడి పోతారు. దీంతో వారు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

శత్రుత్వం, చాకచాక్యం

గరుడ పురాణం దయ, క్షమాపణను బోధించడం కాకుండా.. ఆచరణాత్మక జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. సమాజంలోని దుష్టులు, మోసగాళ్ల మధ్య తనను తాను రక్షించుకోవడానికి జాగ్రత్తగా, దౌత్యపరంగా ఉండాలని ఇది సూచిస్తుంది. మీరు మీ శత్రువుల కుతంత్రాలను అర్థం చేసుకోలేకపోతే, తదనుగుణంగా విధానాలను రూపొందించలేకపోతే.. మీ సౌమ్యత మీ బలహీనతగా మారవచ్చు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)