AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: చిత్తుకాగితాల మాటున గ‘మత్తు’ వ్యాపారం.. గుట్టు బయటపడటంతో అంతా షాక్..

విశాఖ తీరంలో మత్తు ఇంజక్షన్లు కలకలం రేపుతున్నాయి. పనికి రాని చిత్తు వస్తువుల వ్యాపారం వెనుక.. గత కొంతకాలంగా రహస్యంగా సాగుతోన్న గంజాయి విక్రయాల గుట్టురట్టు చేశారు స్థానికులు.

Vizag: చిత్తుకాగితాల మాటున గ‘మత్తు’ వ్యాపారం.. గుట్టు బయటపడటంతో అంతా షాక్..
Ganja Injections
Shiva Prajapati
|

Updated on: Jan 19, 2023 | 9:53 AM

Share

విశాఖ తీరంలో మత్తు ఇంజక్షన్లు కలకలం రేపుతున్నాయి. పనికి రాని చిత్తు వస్తువుల వ్యాపారం వెనుక.. గత కొంతకాలంగా రహస్యంగా సాగుతోన్న గంజాయి విక్రయాల గుట్టురట్టు చేశారు స్థానికులు. పోలీసుల దాడిలో 35 మత్తు ఇంజక్షన్లు, 20 గ్రాముల సిగరెట్లలో వినియోగించే గంజాయి పౌడర్‌ పట్టుబడింది. నిందితులు నక్క మహేశ్వర్ రెడ్డి, మండి చైతన్య, శ్రీరామ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన అనుపమ్ అధికారి పరారీలో ఉన్నాడు.

కాలేజీ విద్యార్థులు తరచూ వచ్చిపోయే ఓస్క్రాప్‌ షాప్‌పై నిఘాపెట్టిన గ్రామస్తులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. అక్కడ భారీగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జరిపిన దాడిలో గంజాయు ముఠా గుట్టురటయ్యింది. పశ్చిమబెంగాల్‌లో 30 రూపాయలకు ఇంజక్షన్‌ కొనుగోలు చేసి.. ఇక్కడ రూ. 200 నుంచి రూ. 300 లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు యువత భవిష్యత్‌ను నాశనం చేసే స్క్రాప్ షాపును తొలగించాలంటూ యాదవ జగరాజుపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజలు. ఇక ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెత్త మాటున మత్తు విక్రయం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..