AP News: దహన సంస్కారాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఊహించని ఘటన..చివరికి నాలుగు ప్రాణాలు..

దహన సంస్కారాలకు వెళ్లిన నలుగురు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న సీఎంఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

AP News: దహన సంస్కారాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఊహించని ఘటన..చివరికి నాలుగు ప్రాణాలు..
Accident
Follow us
Raju M P R

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 22, 2024 | 8:27 AM

అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న సీఎంఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా దేవపట్ల పంచాయతీ వంగమల్లవారిపల్లిలో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల్లో పాల్గొని తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. కలకడ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది.

ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఉన్న 9 మందిలో నలుగురు మృతిచెందగా ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతి చెందిన నలుగురి మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురినీ ప్రాథమిక చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సోమల మండలం నెల్లిమందకు చెందిన షాహీరబీ, నూరుల్లా, కలికిరి మండలం దూదేకులపల్లికి ఖాదర్‌వల్లి, బావాజాన్‌లుగా ఉన్నారు. ఈ మేరకు కలకడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..