AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati Drone Show: అమరావతిలో అద్భుతం.. 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..

దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఈవెంట్‌కు అమరావతి రెడీ అయింది. మంగళవారం పున్నమి ఘాట్‌లో 5వేలకు పైగా డ్రోన్లతో మెగా షో జరగనుంది. విజయవాడ ప్రజలు డ్రోన్‌ షోను చూసేందుకు ఐదు ప్రాంతాల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేశారు

Amaravati Drone Show: అమరావతిలో అద్భుతం.. 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..
Amaravati Drone Summit 2024
Shaik Madar Saheb
|

Updated on: Oct 22, 2024 | 11:56 AM

Share

అమరావతిలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5వేల డ్రోన్లు ఎగరబోతున్నాయి. జాతీయ స్థాయి డ్రోన్ సమ్మెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ఈ డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. పున్నమి ఘాట్ దగ్గర 5వేల‌కుపైగా డ్రోన్లు అలరించనున్నాయి. 9 థీమ్స్‌పై కార్యక్రమాలు జరగనున్నాయి. 400కి పైగా కంపెనీలు ఈ షోలో పాల్గొంటున్నాయి. 1800 మంది డెలిగేట్స్ హాజరవుతారు. నాలుగు కేటగిరీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేశామన్నారు అధికారులు. విజేతలకు కేటగిరీల వారీగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు డ్రోన్‌ షో.. ఐదుచోట్ల డిజిటల్ స్క్రీన్లు

ఈ డ్రోన్ షోను విజయవాడ ప్రజలంతా తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. నగరంలో ఐదు చోట్ల భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్రకాశం బ్యారేజీల దగ్గర స్క్రీన్లను రెడీ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు డ్రోన్ షో జరగనుంది.

డ్రోన్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నామంటున్నారు అధికారులు. బుడమేరు వరదల సందర్భంగా డ్రోన్లను ఎలా వినియోగించామన్న విషయంపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

డ్రోన్ షోలో పాల్గొనేందుకు డెలిగేట్స్‌ ఇప్పటికే అమరావతి చేరుకుంటున్నారు. డ్రోన్ల పండగను తిలకించేందుకు తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..