AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Undavalli Arun Kumar: లోక్‌సభలో మరోసారి చర్చ జరిగితేనే ఏపీకి సరియైన న్యాయంః మాజీ ఎంపీ ఉండవల్లి

ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన కుదరదని అనాడే అద్వానీ స్పష్టంగా చేశారన్నారు.

Undavalli Arun Kumar: లోక్‌సభలో మరోసారి చర్చ జరిగితేనే ఏపీకి సరియైన న్యాయంః మాజీ ఎంపీ ఉండవల్లి
Undavalli Arun Kumar
Balaraju Goud
|

Updated on: Feb 09, 2022 | 2:13 PM

Share

Undavalli Arun Kumar on PM Modi Comments: ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన కుదరదని అనాడే అద్వానీ స్పష్టంగా చేశారన్నారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి రావల్సిన నిధులను రాబట్టడంలో వైసీపీ, టీడీపీ విఫలమయ్యాయని దుయ్యబట్టారు. లోక్ సభలో మరోసారి చర్చ జరిగితేనే ఏపీకి సరియైన న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుక్కుపోయిందని, వాటిపై తాను మాట్లాడనని.. రాబోయే రోజుల్లో భయంకరమైన గడ్డు రోజులు ఉంటాయన్నారు. జగన్ ప్రభుత్వం దగ్గర ఏదైనా సీక్రెట్‌గా ఏదైనా ఉంటే చెప్పాలన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధంకావడం లేదని. ఈ ఉద్యోగుల జీతాలపై సర్కార్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలన్న ఉండవల్లి.. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదన్నారు.. కమిటీ రిపోర్ట్ లేకుండా అయిపోయిందనడం విడ్డూరంగా ఉందన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పడం వల్లే జగన్ అధికారంలోకి వచ్చారని.. ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా పార్లమెంటు సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఉండవల్లి సూచించారు. పోలవరం ఇచ్చిన బిల్లులు ఆపేస్తున్నారని.. చంద్రబాబు అలా తీసుకుని తప్పు చేశారు.. జగన్ తిరిగి ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పాలన్నారు. కొంత సమయం పెట్టి పార్లమెంట్‌లో చర్చ పెట్టాలని.. పోలవరం కట్టాల్సిన బాధ్యత జగన్‌కు ఎందుకు.. బాధ్యత కేంద్రానిదే అన్నారు.

ఏపీకి అన్యాయం జరుగుతుంటే అడగటం లేదని అరుణ్ కుమార్ ప్రశ్నించారు. అన్యాయం జరిగిందని.. అన్యాయం చేసిన వ్యక్తే అడగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన హామీలను కూడా ఎందుకు అడగటం లేదని.. ఎనిమిదేళ్లు అయ్యింది.. వైసీపీ, టీడీపీవాళ్లు పార్లమెంట్‌లో నోటీసులు ఇవ్వాలన్నారు. ఇటీవల మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా ఉండవల్లి స్పందించారు. కేసీఆర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని.. ప్రధానిని ఉద్దేశించి ఇలాంటి మాటలు ఏంటని.. ఒక ముఖ్యమంత్రి ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.