Babu vs Karanam: ఒకప్పటి మిత్రులు.. ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్దులు.. సవాల్‌కు ప్రతి సవాల్ విరుసుకుంటున్న నేతలు

ఒకప్పటి మిత్రులు... ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్దులు... టిడిపి అధినేత చంద్రబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంల మధ్య మాటల యుద్దం మొదలైంది. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా.. కదలిరా.. బహిరంగ సభలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Babu vs Karanam: ఒకప్పటి మిత్రులు.. ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్దులు.. సవాల్‌కు ప్రతి సవాల్ విరుసుకుంటున్న నేతలు
Chandrababu Naidu Karanam Balram

Edited By:

Updated on: Feb 18, 2024 | 4:36 PM

ఒకప్పటి మిత్రులు… ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్దులు… టిడిపి అధినేత చంద్రబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంల మధ్య మాటల యుద్దం మొదలైంది. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా.. కదలిరా.. బహిరంగ సభలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2019 వరకు మనమే గెలించామని, ఆ తరువాత చీరాలలో బలరాంను మనం గెలిపిస్తే, పార్టీ కష్టకాలంలో ఉంటే ఫిరాయించాడని ఘాటు విమర్శులు గుప్పించారు. ఈసారి తనను మరోసారి గెలిపించాలని చీరాలలోని టీడీపీ నేతలను కొరుతున్నాడని, తనను గెలిపిస్తే తిరిగి మన పార్టీలోకి వస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు.

మనేమేమన్నా అమాయకులమా.. తమ్ముళ్ళూ అంటూ బలరాంకు చురకలు అంటించారు బాబు. మోసం చేసిన వాళ్ళకు బుద్ది చెప్పాలా… వద్దా.. అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కరణం బలరాంను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న కరణం బలరాం అంతే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యలను చీరాల ఎమ్మెల్యే కరణం బలరా తీవ్రంగా ఖండించారు. ఇంకొల్లు సభలో తనను దుర్మార్గుడుగా చంద్రబాబు అభివర్ణించారని, తనపై అవాకులు, చవాకులు పేలడం వల్ల తాను కూడా మట్లాడాల్సి వస్తుందన్నారు.

చంద్రబాబు నాయుడు కన్నా దుర్మార్గున్ని ఇంతవరకు ఎవరిని చూడలేదన్నారు కరణం. నీ చరిత్ర ఎందో.. నా చరిత్ర ఎందో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్‌ విసిరారు. మీ ఆఫీస్‌కు రమ్మన్నా వస్తాను అంటూ సవాల్ విరిసిరారు.1970 నుంచి ఎవరి చరిత్ర ఏందో అందరికీ తెలుసునన్నారు. 2019లో నేను చీరాలకు పోతాను అని అడగలేదని, చంద్రబాబును, తన కొడుకుని చీరాలలో కొంతమంది తిడితే నన్ను అడ్డం పెట్టుకోవడానికి చీరాలకు పంపించారన్నారు. చీరాలలో ప్రజలు తనను పార్టీలతో సంబంధం లేకుండా గెలిపించారన్నారు. .. చీరాలలో నన్ను గెలిపించానని చెబుతున్నావు… నీకంత సత్తా ఉంటే నీ కొడుకు లోకేష్ ను మంగళగిరిలో ఎందుకు గెలిపించుకోలేకపోయావని ప్రశ్నించారు..

2014లో 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నావు.. ఇలాంటి చర్యలను అప్పుడే ఖండించామన్నారు కరణం బలరాం. పార్టీ ని మోసం చేసి వెళ్లిపోలేదని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చూస్తే బాగుండదని కరణం హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే సమయంలో విజయవాడ మనోరమ హోటల్ నుంచి డబ్బు సూట్ కేసులను హైదరాబాద్ ఫామ్ హౌస్ కు ఎవరు తీసుకెళ్లారో మీకు తెలియదా.. అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు కరణం బలరాం. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు..

ఎన్టీఆర్ పెట్టిన పార్టీ… కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మీ చేతికి వచ్చిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పెద్ద నాయకులను ఏ విధంగా చిత్రహింసలు పెట్టింది తనకు తెలుసన్నారు. పరిటాల రవి, కోడెల శివప్రసాద్ విషయంలో ఇబ్బందులు పెట్టారని కరణం ఆరోపించారు.. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళను పరామర్శించలేదు… వీటి గురించి నేను మాట్లాడదలచుకోలేదని, నాపైనే మచ్చలు వేస్తున్నప్పుడు మాట్లాడక తప్పట్లేదన్నారు. అన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఎవరిని బదనాం చేయాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కరణం బలరాం మండిపడ్డారు. నువ్వు రెచ్చగొడితే… మేము కూడా నీ పైన మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.

పార్టీలో చాలా కుటుంబాలు బలైపోయాయన్నారు… గతంలో వేమవరంలో ఇద్దరు టిడిపి కార్యకర్తలు చనిపోతే కనీసం పరామర్శించలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నావని దుయ్యబట్టారు. పార్టీ అధికారం లేనప్పుడు కార్యకర్తలే నా ప్రాణం అంటావు.. పోలింగ్ బూతులు దగ్గర కేసులు పెట్టించుకుంటే వాళ్ల గురించి పట్టించుకోవా అని నిలదీశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 1978లో ఇందిరాగాంధీ తనను మూడో కుమారుడిగా అభివర్ణించిందని, తనకు మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా… పివి నరసింహారావుకు నచ్చజెప్పి చంద్రబాబుకు మంత్రి పదవి వచ్చేలా చేశానన్నారు. ముఖ్యమంత్రి అయితే కొమ్ములు వస్తాయా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కళ్ళలో పడి టీడీపీ పార్టీలో ఎదిగావని ఎద్దేవా చేశారు. టీడీపీ టికెట్ అడిగానని నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు కరణం. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కూతలు కూస్తే బాగుండదని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…