R Narayana Murthy : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటా : సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి

R Narayana Murthy : ఏలేరు-తాండవ అనుసంధానంపై ప్రముఖ సినీనటుడు నారాయణమూర్తి స్పందించారు. తమ విజ్ఞప్తికి సీఎం జగన్ స్పందించారని ఆయన ఆనందం వ్యక్తం..

R Narayana Murthy : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటా :  సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి
R Narayana Murthy Cm Jagan
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 23, 2021 | 11:06 PM

R Narayana Murthy : ఏలేరు-తాండవ అనుసంధానంపై ప్రముఖ సినీనటుడు నారాయణమూర్తి స్పందించారు. తమ విజ్ఞప్తికి సీఎం జగన్ స్పందించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనుసంధానం కారణంగా పలు మండలాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుందని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ప్రజలతో పాటు తాను కూడా సీఎంకు రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఏలేరు-తాండవ కాలువల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి సమస్యలు తీర్చాలని తాను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని నారాయణమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన విన్నపానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, వెంటనే నిధులు మంజూరు చేశారని అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నారాయణమూర్తి అన్నారు.

ఈ రెండు కాలువల అనుసంధానం వల్ల విశాఖ జిల్లాకు చెందిన కోట వూరుట్ల, నాతవరం, నర్సీపట్నం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం, కోటనందూరు, ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాలకు నీటి సౌకర్యం కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఏలేరు-తాండవ పనుల నిమిత్తం రూ.470 కోట్లు సీఎం మంజూరు చేశారని, అందుకు సహకరించిన మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నారాయణమూర్తి చెప్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గానీ, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోలేదని నారాయణ మూర్తి విమర్శించారు.

Read also :దేశం కాని దేశంలో తలదాచుకుంటున్న వారిపై పగబట్టిన విధి.. ప్రపంచంలోనే అతి పెద్ద రెఫ్యూజీ క్యాంప్ లో భారీ అగ్ని ప్రమాదం

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..