రైతులను వదలని మోసగాళ్లు.. ఆఫర్ల పేరుతో ఘరానా మోసం..
రైతులకు నకిలీ విత్తనాలు శాపంగా మారాయి. మొక్క మొలవక ముందే రైతు కుదేలవుతున్నాడు. నకిలీ విత్తనాల విక్రయాలు మార్కెట్లో జోరుగా జరుగుతున్నాయి. మార్కెట్ మాయగాళ్లను కట్టడి చేయడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, మరికొందరి చేతివాటం రైతులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. తొలకరి వానల ప్రారంభంతో ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్నారు రైతులు. దుక్కిదున్ని, ఎరువులు వేసి విత్తనాల కోసం షాపులు ముందు బారులుదీరి మరీ కొనుగోలు చేస్తున్నారు రైతులు.

రైతులకు నకిలీ విత్తనాలు శాపంగా మారాయి. మొక్క మొలవక ముందే రైతు కుదేలవుతున్నాడు. నకిలీ విత్తనాల విక్రయాలు మార్కెట్లో జోరుగా జరుగుతున్నాయి. మార్కెట్ మాయగాళ్లను కట్టడి చేయడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, మరికొందరి చేతివాటం రైతులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. తొలకరి వానల ప్రారంభంతో ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్నారు రైతులు. దుక్కిదున్ని, ఎరువులు వేసి విత్తనాల కోసం షాపులు ముందు బారులుదీరి మరీ కొనుగోలు చేస్తున్నారు రైతులు. కొనుగోలు చేసిన విత్తనాలను సాగు విధానాల ప్రకారం పొలాల్లో ఎదజల్లుతారు రైతులు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఈ ఏడాది అయినా లాభదాయకంగా ఉండాలని ఎన్నో ఆశలతో సాగుకు సమాయత్తం అవుతున్నారు. అలా ఆశలు పెట్టుకున్న రైతులకు ఆదిలోనే హంసపాదులా మారుతుంది నకిలీ విత్తనాల వ్యవహారం. నాటిన విత్తనాలతో మొక్క మొలిచి ఏపుగా పెరుగుతుందని అనుకుంటే, తాము నాటిన విత్తనాలు రోజులు గడుస్తున్నా మొలకెత్తడం లేదు. దీంతో తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు రైతులు. నకిలీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోయిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో నెలకొంది.
ఈ జిల్లాలో అత్యధికంగా వర్షాధార ప్రాంతం కావడంతో ప్రత్తి, మొక్కజొన్న పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు. అధిక మొత్తంలో మొక్కజొన్న, ప్రత్తి సాగు చేస్తుండటంతో విత్తనాల డిమాండ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు కూడా ఒకటి, రెండు కాకుండా అనేక రకాల కంపెనీలు ఉంటాయి. ఈ క్రమంలోనే బ్రాండెడ్ కంపెనీల ముసుగులో నకిలీలు ఎంటర్ అవుతున్నారు. అలాంటి నకిలీలు తమకున్న మార్కెటింగ్ స్కిల్స్‌తో బ్రాండెడ్ కంపెనీలను మించి రైతులను ఆకర్షించేందుకు ప్రకటనలు గుప్పిస్తున్నారు. తమ మాయాజాలంతో విత్తనాలు అమ్మే షాపులకు ఆఫర్లు గుప్పించి పెద్ద మొత్తంలో మార్కెట్లో తమ విత్తనాలు అమ్ముడుపోయేలా ప్లాన్ చేస్తారు. అలాంటి మాయగాళ్ళ వలలో పడి నిలువునా మునిగిపోతున్నారు రైతులు. సహజంగా ఎకరానికి ఒక ప్యాకెట్ నుండి రెండు ప్యాకెట్స్ వరకూ ఎదజల్లుతుంటారు. అలా వేసిన తర్వాత కొద్ది రోజులకు మొక్కలు వస్తాయి. అయితే ఇక్కడ మాత్రం కొంతమేర మొక్కలు వస్తున్నాయి. ఇక చేసేదిలేక మళ్లీ మరో రెండు ప్యాకెట్లు తెచ్చి వేస్తున్నారు రైతులు. అలా తెచ్చిన ప్యాకెట్లలో కూడా యాభై నుండి వంద గ్రాముల వరకు తక్కువగా ఉంటాయి. 500గ్రాముల ప్యాకెట్ కొంటే అందులో కేవలం 400 నుండి 450 గ్రాముల మాత్రమే ఉంటున్నాయి.
ఓ వైపు మొలకెత్తక, మరో వైపు తూనికల్లో తేడాతో పొలంలో విత్తనాలకే అధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అసలు మొక్క ఎందుకు మొలకెత్తడం లేదని విత్తనం వేసిన ప్రాంతంలో త్రవ్వి చూస్తే అక్కడ విత్తనాన్ని పురుగులు తినేసి కనిపిస్తుంది. సహజంగా నాణ్యమైన విత్తనాలను భూమిలో ఎదజల్లిన తరువాత పురుగులు తినకుండా, కుళ్ళిపోకుండా ఉండేందుకు కెమికల్స్‌తో ప్రక్రియ చేసి విత్తనాలు తయారుచేస్తారు. కానీ నాసిరకం విత్తనాలు కావడంతో అలాంటి ప్రక్రియ చేయకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తడం లేదని గుర్తించారు. పంట సాగులో ఆలస్యం అయ్యి మొక్కలకు అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు రైతులు. సరైన సమయానికి పంట వేయకపోవడం వల్ల తెగుళ్లుకు తట్టుకోలేకపోవడం, దిగుబడి తక్కువ రావడం జరుగుతుంది. అయితే మార్కెట్ లో ఉన్న విత్తనాల డిమాండ్‌ను పసిగట్టి వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేస్తున్న సమయంలో ఏవి మంచి విత్తనాలు? ఏవి నకిలీ విత్తనాలు అని గుర్తించడం రైతులకు తెలియదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన షాపులు కావడంతో అక్కడ అమ్మే ప్రతి విత్తనాలు మంచివే అనుకుంటారు రైతులు.
పొలంలో విత్తనాలు ఎదజల్లిన తరువాత కొన్ని సందర్భాల్లో పొలాల్లో విత్తనాలు మొలకెత్తడం వరకు బాగానే ఉంటుంది. కానీ తెగుళ్లు తట్టుకునే స్వభావం ఉండకపోవడం వల్ల పురుగు మందుల పెట్టుబడి పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే ఏదో ఒకలా మొక్కలు పెరిగి ఇక దిగుబడి వచ్చే సమయం వచ్చిందని ఆశతో ఎదురుచూస్తుంటారు. అయితే పెరిగిన మొక్క పెరిగినట్లే ఉంటుంది కానీ ఎంతకీ దిగుబడి రాదు. అప్పటికే పొలం మీద వేల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టి ఉంటారు రైతులు. చివరికి అధికారుల సహాయంతో దిగుబడి రాలేదని పరిశీలిస్తే చివరికి అవి నాసిరకం విత్తనాలు అని తెలుసుకొని వేలాది రూపాయలు బూడిదలో పోసిన పరిస్థితిలా ఏర్పడిందని లబోదిబోమంటుంటారు రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
