Andhra Pradesh: దావోస్ సమ్మిట్‌కు ఏపీకి ఆహ్వానం లభించలేదా..? సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. ప్రభుత్వ స్పందన ఏంటంటే..?

తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌కు హాజరవ్వకపోవడంపై పలువిధాలుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

Andhra Pradesh: దావోస్ సమ్మిట్‌కు ఏపీకి ఆహ్వానం లభించలేదా..? సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. ప్రభుత్వ స్పందన ఏంటంటే..?
World Economic Forum 2023
Follow us

|

Updated on: Jan 17, 2023 | 3:45 PM

స్విట్జర్లాండ్‌‌లోని దావోస్‌లో ఏటా జనవరి నెలలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం జరుగుతోంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ శిఖరాగ్ర సమావేశం సోమవారం (జనవరి 16) ప్రారంభం కాగా.. ఈ నెల 20 వరకు.. ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పాలక నేతలు, పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో తమ దేశాలు, రాష్ట్రాల గురించి ప్రత్యేక పెవిలియన్లు ఏర్పాటు చేసి పెట్టుబడిదారులను ఆకర్షించేలా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇంకా, తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేలా వ్యాపార సంస్థలను ఆకర్షిస్తున్నారు. అయితే, ఏటా మాదిరిగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రత్యేక ప్రతినిధి బృందంతో వెళ్లి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అయితే.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌కు హాజరవ్వకపోవడంపై పలువిధాలుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ప్రతినిధి బృందం దావోస్ కు వెళ్లి పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. సారి మాత్రం ఏపీ నుంచి ఎలాంటి ప్రతినిధి బృందం వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, దావోస్ పర్యటనకు ఆంధ్రప్రదేశ్ బృందం వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు, అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయి. కావాలని కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ.. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై బురదజల్లేలా ప్రచారం చేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించలేదని.. అందుకే ఏపీ వెళ్లలేదంటూ పలు వార్త సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇదంతా అబద్దమంటూ కొట్టి పారేసింది.

ఇవి కూడా చదవండి

ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ట్వీట్..

సోషల్ మీడియాలో కొన్ని వెబ్‌సైట్లు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొంది. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ను ఆహ్వానించలేదనడం పూర్తిగా అవాస్తవమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏపీకి ఆహ్వానించిన లెటర్ హెడ్‌ను ట్విట్టర్ వేదికగా జతచేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దంటూ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..