AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja Selvamani: మిడతల్ని, ఉడతల్ని పట్టించుకోను.. ఆది, శ్రీనులపై రోజా పవర్ పంచెస్

ఏపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా అస్సలు తగ్గట్లేదు.. అపోజిషన్‌లో ఎవరున్నా తన పంచ్‌లతో మడతెట్టేస్తున్నారు. తాజాగా కమెడియన్స్ ఆది, శ్రీనులను ఏకిపారేశారు.

Roja Selvamani: మిడతల్ని, ఉడతల్ని పట్టించుకోను.. ఆది, శ్రీనులపై రోజా పవర్ పంచెస్
Get Up Srinu - Hyper Aadi -Minister Roja
Ram Naramaneni
|

Updated on: Jan 17, 2023 | 3:50 PM

Share

ఏపీలో ఏం నడుస్తోంది. రాజకీయం నడుస్తోంది. జబర్దస్త్‌గా రాజకీయం నడుస్తోంది. ఇది నవ్వులు పూయించే రాజకీయం కాదు. మాటలతో మండించే, ప్రత్యర్థులకు మంట పుట్టించే రాజకీయం నడుస్తోంది. మొన్న హైపర్‌ ఆది శ్రీకాకుళంలో తనదైన టెంపర్‌తో మినిస్టర్‌ రోజాపై ఇండైరెక్ట్‌గా అటాక్‌ చేశారు. అటు గెటప్ శ్రీను సైతం రోజా కేవలం కోసం మెగా ఫ్యామిలీపై కామెంట్స్ చేస్తున్నారని.. ఫేస్‌బుక్ వేదికగా కాస్త గట్టిగానే పోస్ట్ పెట్టాడు.

తాజాగా రోజా… హైపర్‌ ఆదికి, గెటప్ శ్రీనుకి హైపర్‌ టెన్షన్‌ పుట్టించే లెవెల్లో రాజకీయ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేశారు. మెగా కాంపౌండ్‌లో ఆరు హీరోలు ఉన్నారు. వాళ్ల ప్రాపకం కోసం ఇలా చిన్నిచిన్న ఆర్టిస్టులు జబర్దస్త్‌ కామెడీ చేస్తున్నారు అంటూ రోజా విమర్శించారు. మెగా హీరోల ప్రాపకం కోసం, సినిమాల్లో వేషాల కోసం తన మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు.

సినిమా ఫీల్డ్‌ నుంచి వచ్చిన కోట శ్రీనివాసరావు, శారద, బాబూమోహన్‌, తాను అందరం ఎన్నికల్లో గెలిచామని…వాళ్లు తప్ప అంటూ పవన్‌, నాగబాబులపై రోజా సెటైర్లు వేశారు. పొలిటికల్‌ అజ్ఞానులు, జోకర్లు చేసే విమర్శలను తాను పట్టించుకోనంటూ ఘాటుగా స్పందించారు రోజా. తాను మంత్రిని అయ్యాక పర్యాటక రంగంలో ఏపీ 18వ ప్లేసుకు పడిపోయిందని అజ్ఞానంతో మాట్లాడుతున్నారంటూ హైపర్‌ ఆదికి పవన్‌ కల్యాణ్‌కి చురకలు అంటించారు రోజా

రోజా నవ్వుతూనే రాజకీయ చురకలు అంటించారు. హైపర్‌ ఆది కామెంట్లను లైట్‌గా తీసుకుంటూనే హెవీ పొలిటికల్‌ పంచ్‌లతో దాడి చేశారు. ఇంతకీ రోజా గురించి హైపర్‌ ఆది ఏమన్నాడు. కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళంలో జరిగిన పవన్‌ సభలో మంత్రులకు శాఖల గురించి తెలియదంటూ ఇండైరెక్ట్‌గా రోజాను ఆది టార్గెట్‌ చేస్తే చిన్న మిడతలు, ఉడతలు గురించి పట్టించుకోవద్దంటూనే రోజా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..