AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పవన్‌పై పోటీకి సిద్ధం.. 175 సీట్లు పక్కా.. అలీ సంచలన కామెంట్స్

అలీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో ఉండటం ఖాయంగా తెలుస్తోంది. ఆయన ఎక్కువగా రాజమండ్రి సీటుపై మనసు పడుతున్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే.. జనసేన అధినేతపై కూడా పోటీ చేస్తానంటున్నారు.

Andhra Pradesh: పవన్‌పై పోటీకి సిద్ధం.. 175 సీట్లు పక్కా.. అలీ సంచలన కామెంట్స్
Ali - Pawan Kalyan
Ram Naramaneni
|

Updated on: Jan 17, 2023 | 3:07 PM

Share

సినీ నటుడు అలీ సంచలన కామెంట్స్ చేశారు.  పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమన్నారు. పార్టీ ఆదేశానికి అనుగుణంగా ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి తాను రెడీ అన్నారు అలీ. సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడే అయినా.. పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశిస్తే నేను సిద్ధమన్నారు అలీ. 2024 ఎన్నికల్లో 175 సీట్లలో వైసీపీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు అలీ. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.

రోజా ఫైర్ బ్రాండ్, ఆమె ఎక్కడా తగ్గదన్నారు. మెగా ఫ్యామిలీతో రోజాకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్న ఆయన.. రోజాను డైమండ్ రాణీతో పోల్చడమంటే విలువైనదిగా పోల్చడమే అన్నారు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ.. పార్టీ తరఫున ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని, ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని వార్తలు సర్కులేట్ అయ్యాడు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన్ను  ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. ఈ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగనున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు అలీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..