Andhra Pradesh: పండుగ వేళ APSRTCకి కాసుల పంట.. రాయితీతో భలే గాలం
పండక్కి వెళ్లేవారు ఒకేసారి రానూ, పోనూ టికెట్స్ బుక్ చేసుకుంటే ధరలో 10 శాతం రాయితీ.. ఆఫర్ భలే ఉంది కదా.. ఇలానే ప్రయాణీకులకు గాలం వేసింది APSRTC.

పండక్కి నగరంలోని ప్రజలంతా సొంతర్లూకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో మస్త్ ఎంజాయ్ చేశారు. బాల్య మిత్రుల్ని కలిశారు. కోడి పందాలు వేశారు. సెలవులు అయిపోవడంతో పిండి వంటలు క్యానులతో రిటన్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు భాగ్యనగరం చేరుకున్నారు. అయితే పండుగ వేళ ఆర్టీసీకి కాసుల పంట పండింది. స్పెషల్ బస్సుల్లో కూడా నార్మల్ ఛార్జీలు వసూలు చేసి.. ప్రయాణీకుల మనస్సు దోచుకుంది ఏపీఎస్ ఆర్టీసీ.
సంక్రాంతి పండక్కి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపిన APSRTC భారీ ఆదాయం గడిచింది. విజయవాడ రీజియన్ పరిధిలో పండుగకి ముందు వరకు 591 స్పెషల్ బస్సులు నడిపి రికార్డ్ స్థాయిలో 1.22 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. హైదరాబాద్, విశాఖ, రాజమండ్రి, అమలాపురం, రాయలసీమ, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు స్పెషల్ బస్సుల ఆపరేషన్ జరిగింది. వీటి ద్వారా ఆర్టీసీ అదనంగా 3 లక్షల 7వేల 747 కిలోమీటర్ల మేర బస్సులు నడిపింది.
పండక్కి ముందు జరిగిన ప్రయాణాల జోష్‌తో ఆర్టీసీ అధికారులు తిరుగు ప్రయాణాలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18 వరకు మరో 400 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. 16న హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు మొత్తం 100 బస్సులు నడిపారు. 17న 150 బస్సులు, 18న మరో 150 స్పెషల్ బస్సుల చొప్పున నడపనున్నారు. అలాగే ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించారు ఆర్టీసీ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
