Viral: ఫోటో తీసుకునేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కిన అంకుల్.. వెంటనే డోర్స్ క్లోజ్.. కట్ చేస్తే…
అసలే వందే భారత్ ట్రైన్.. ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయ్. ఫోటో తీసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆ అంకుల్ కూడా అలానే అనుకున్నాడు. అయితే బయట నుంచి కాకుండా లోనికి వెళ్లాడు. వెంటనే డోర్స్ క్లోజ్ అయిపోయాడు.

సికింద్రాబాద్ – విశాఖ మధ్య వందే భారత్ ట్రైన్ పరుగులు పెడుతోంది. పండుగ రోజు ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. 16వ తేదీ నుంచిపూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది వందే భారత్. ఈ ట్రైన్ వలన సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణ సమయం భారీగా తగ్గింది. ఈ ట్రైన్‌లో కేవలం 8 గంటల 40 నిముషాల్లోనే విశాఖ చేరుకుంటారు. అలానే వైజాగ్ నుంచి సికింద్రాబాద్ చేరుకోవచ్చు. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఈ ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే ఆ అనుభూతే వేరు. ఇప్పటి వరకూ నడుస్తున్న వందే భారత్ ట్రైన్లలో కెల్లా ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కూడా ఇదే. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడంతో.. ఈ ట్రైన్‌ను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఔత్సాహికులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ట్రైన్ వచ్చే సమయానికి జనాలు భారీగా ఆయా స్టేషన్లకు చేరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఓ అంకుల్ అడ్డంగా బుక్కయ్యాడు. వందే భారత్ ట్రెయిన్‌లో సెల్ఫీ కోసం లోపలికి వచ్చిన ఆయన… డోర్ లాక్ కావడంతో అందులో ఇరుక్కు పోయాడు. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కావడంతో వెంటనే డోర్ క్లోజ్ అయింది. దీంతో కంగారుపడ్డ సదరు వ్యక్తి టీసీని డోర్ తీయాలంటూ వేడుకున్నాడు. కాళ్లా వేళ్లా పడ్డారు.. ససేమిరా అన్న టీసీ విజయవాడ వరకూ ఆగాల్సిందే అన్నాడు. పనిలో పనిగా బుద్దంగా అంటూ తిట్టిపోశాడు. విశాఖ నుంచి వస్తున్న ట్రైన్ రాజమండ్రిలో ఆగింది. ఆగగానే…ఫొటో తీసుకునేందుకు సరదాగా ట్రైన్ ఎక్కేశాడు ఆ అంకుల్. తరువాత అంతే నానా తిప్పలు పడాల్సి వచ్చింది.
సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో మాత్రమే ట్రైన్ ఆగనుంది. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్‌తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు. ఈ ట్రైన్‌లో చాలా సురక్షితమైన.. వేగవంతమైన ప్రయాణం చేయవచ్చంటున్నారు అధికారులు. ఇప్పటికే ఏడు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కగా, సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు ఎనిమిదో రైలు కేటాయించింది భారత ప్రభుత్వం. తెలుపు వర్ణం, దానిపై నీలి రంగు చారలు, బుల్లెట్ ట్రైన్ తరహాలో లోకో ముందు రూపు, వెడల్పాటి నలుపు రంగు కిటికీ వరస.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ ట్రైన్ డిజైన్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
