AP News: చీరాల పట్టణంలో విషాదం.. సమోసాలు అమ్ముతూ గుండెపోటుతో కుప్పకూలి..
గుండెపోట్లు ఎందుకు పెరిగాయి. కోవిడ్ వచ్చినవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 5 రెట్లు ఎక్కువ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే లైఫ్ స్టైల్ మార్చేయాలి. డైలీ ఒక క్రమ పద్దతిని ఫాలో అవ్వాలి.
చీరాల పట్టణంలో శివ అనే వృద్ధుడు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుతో నడిరోడ్డుపైనే హఠాన్మరణం చెందాడు. దశాబ్దాలుగా సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగించే శివ అదే పనిపై తిరుగుతూ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్దకు రాగానే కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటిన తరలి వచ్చారు
108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కిషోర్ ఆధ్వర్యంలో సిబ్బంది సీపీఆర్ చేసినా శివ ప్రాణాలు నిలవలేదు.దీంతో అతడు తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందాడని 108 సిబ్బంది నిర్ధారించారు. పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.
కాగా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు పెరిగాయి. ఉన్నట్లుండి ఆకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో వ్యవధిలో విగత జీవులుగా మారిపోతున్నారు. గుండెపోటు వచ్చిన వ్యక్తులకు వెను వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా.. వారికి పునర్జన్మ ఇవ్వవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే సీపీఆర్‌పై అటు ప్రభుత్వాలు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..