Earthquakes: పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో భూ ప్రకంపనలు.. భయాందోళనల్లో పరిసర గ్రామాల ప్రజలు..
పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గ్రామాల్లో భూమి కంపించిన ఘటనలు నమోదౌతున్నాయి. ఇవాళ కూడ భూమి కంపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ భూ ప్రకంపనలతో ఊగిపోయింది. ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు..భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డాయి. తెల్లవారుతూనే ఒక్కసారిగా భూమి కదిలిపోతున్న ఫీలింగ్‌తో.. స్థానికులంతా భయాందోళన చెందారు. ఇళ్లలోని పాత్రలన్నీ షేకవుతుండటంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక బయటకు పరుగులు తీశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రెండు నుంచి మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లోనూ భూ ప్రకంపనలొచ్చాయి. మాదిపాడు, చల్ల గరిగ, గింజపల్లి గ్రామాల్లో స్వల్ప భూకంపనలు నమోదయ్యాయి. ఉదయం 7గంటల 26నిమిషాలకు భూమి లోపల శబ్దాలతో ప్రకంపనలొచ్చాయి. దీంతో పులిచింతల ప్రాజెక్ట్ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గతంలోకూడా పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గ్రామాల్లో భూమి కంపించిన ఘటనలు నమోదౌతున్నాయి. ఇవాళ కూడ భూమి కంపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం