APSRTC: ఇకపై క్యాష్‌తో పనిలేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన

ఏపీఎస్ఆర్టీసీ తన ప్రయాణీకులు గుడ్ న్యూస్ అందించింది. బస్సు ప్రయాణంలో క్యాష్, చిల్లర సమస్యలకు చెక్ పెడుతూ..

APSRTC: ఇకపై క్యాష్‌తో పనిలేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన
Apsrtc
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 22, 2022 | 11:18 AM

కరోనా తర్వాత నుంచి క్యాష్ పేమెంట్స్ తగ్గిపోయాయి. అన్ని ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ శాతం ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీఎస్ఆర్టీసీ తన ప్రయాణీకులు గుడ్ న్యూస్ అందించింది. బస్సు ప్రయాణంలో క్యాష్, చిల్లర సమస్యలకు చెక్ పెడుతూ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ పేరిట డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులో ఉంచింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా బస్సు టికెట్‌కు డబ్బును చెల్లించే వెసులుబాటును కల్పించింది. ఇక ఈ డిజిటల్ చెల్లింపుల పట్ల ప్రయాణీకుల నుంచి అనుకూల స్పందన వస్తోందని ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది.

మొదటిగా ఈ డిజిటల్ చెల్లింపులను విశాఖపట్నం జిల్లాలో అమలు చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. తొలుత విశాఖ నుంచి దూరప్రాంతాలకు నడిచే 97(డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, అమరావతి) సర్వీసుల్లో ఈ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా నడిచే అన్ని బస్సుల్లోనూ, సిటీ బస్సుల్లో దశల వారీగా యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ చెప్పింది.

టిమ్స్‌ స్థానంలో ఈ–పోస్‌ మిషన్లు:

ప్రస్తుతం బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు టిమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో అధికారులు ఈ- పోస్ యంత్రాలను తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాకు 180 ఈ-పోస్ మిషన్లు వచ్చాయి. వీటి వినియోగంపై ఇప్పటికే డ్రైవర్లు, కండక్టర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. కాగా, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్‌ చేసేవారు 10 శాతంగా ఉండగా.. ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Digital Payments In Ap

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే