AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కుక్క తెచ్చిన తంటా.. పొల్లు పొల్లు కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్!

విజయవాడలో రెండు వర్గాల మధ్య చిన్నగా మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఓ పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాలు దారుణంగా కొట్టుకున్నాయి. ఓ వ్యక్తి తన మనవరాలిని స్కూల్‌ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యలో వారిని చూసిన ఓ పెంపుడు కుక్క మొరిగింది. దాన్ని పట్టుకున్న యువకుడు కుక్కను నియంత్రించక పోవడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అదికాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Watch Video: కుక్క తెచ్చిన తంటా.. పొల్లు పొల్లు కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్!
Vijayawada
Vasanth Kollimarla
| Edited By: |

Updated on: Jul 12, 2025 | 8:42 PM

Share

కొందరు వ్యక్తులు క్షనికావేశంలో గోటిలో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటున్నారు. మాటలతో పరిష్కరించే సమస్యలను కూడా చేతల వరకు తెచ్చుకుంటున్నారు. తాజాగా విజయవాడలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ పెంపుడు కుక్క విషయంలో రెండు వర్గాల మధ్య చిన్నగా మొదలైన వివాదం కాస్తా దారుణంగా కొట్టుకునే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పటమట పీఎస్ రామలింగేశ్వర నగర్ పరిధిలో నివాసం ఉంటున్న రావమరావు అనే వ్యక్తి తన మనవరాలిని స్కూల్ బస్సు ఎక్కించడానికి ఆమెను తీసుకొని వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న అభి అనే యువకుడు తన పెంపుడు కుక్కతో జాగింగ్‌కు వెళ్తున్నాడు.

ఈ క్రమంలో అభి పెంపుడు కుక్క తన సహజగుణాన్ని బయటపెట్టింది.. అందరిమీదకు మెరుగుతూ వెళ్లినట్టుగానే.. దారిలో వెళ్తున్న రామరావు, అతని మనవరాలిపైకి మొరుగుతూ దూసుకెళ్లింది. అయితే కుక్కను పట్టుకున్న యువకుడు దాన్ని నియంత్రించకపోగా.. చూస్తూ నిలబడినట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన రామరావు, అతని మనవరాలు సదురు యువకుడితో గొడవకు దిగారు.

వీడియో చూడండి..

ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దారుణంగా పిడి గుద్దులు గుద్దుకున్నారు. ఈ గొడవలో ఇద్దరికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్తా పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది. అయితే అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విడియో చూసిన నెటిజన్‌లు ఇంత చిన్న విషయానికి కొట్టుకోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.