Andhra Pradesh: స్మశాన వాటిక మధ్యలో అంగరంగవైభవంగా జాతర.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కవుతారు..!

Andhra Pradesh: స్మశాన వాటిక మధ్యలో అంగరంగవైభవంగా జాతర.. ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కవుతారు..!
Lord

Andhra Pradesh: కొరడా దెబ్బలు.. అగ్నిగుండాలు.. విచిత్ర వేషాలు.. సంతానం కోసం కొంగు పట్టి అన్నప్రసాదాలకోసం పోరాటాలు..

Shiva Prajapati

|

Mar 04, 2022 | 6:58 AM

Andhra Pradesh: కొరడా దెబ్బలు.. అగ్నిగుండాలు.. విచిత్ర వేషాలు.. సంతానం కోసం కొంగు పట్టి అన్నప్రసాదాలకోసం పోరాటాలు.. స్మశానంలో జనసందోహాలు.. ఇవి చిత్తూరు జిల్లాలో మహాశివరాత్రి తీసుకొచ్చే ఎన్నో సాంప్రదాయాలు.. మరెన్నో విచిత్రాలు. భక్తుల విశ్వాసాలకు తగ్గట్టుగానే పూనకాల విన్యాసాలు. కర్నాటక, తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో అలాంటి విశేషాలు ఎన్నేన్నో ఉన్నాయి.

చిత్తూరు జిల్లా.. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో ఎన్నో సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు. వీటన్నిటిలో ఎన్నో విశేషాలు దాగి ఉంటాయి. మహాశివరాత్రి తర్వాత జిల్లాలోని పలుచోట్ల మాయాన సేవ పేరుతో చిత్తూరులో జరిగే స్మశానకొల్లుతో పాటు తలకోనలో సంప్రదాయబద్ధంగా సిద్దపూజ, కుప్పం స్మశాసంలో మానవుల అస్తికల మద్య అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి కొరడా దెబ్బలతో భక్తులకు ముక్తి కలిగించే ఎన్నో సంప్రాదాయాలు వింతగా కొనసాగుతున్నాయి. చిత్తూరులో మహాశివరాత్రి మరుసటి రోజు శ్మశానకొల్లు నిర్వహించే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటారు. లోక కళ్యాణం కోసం పార్వతీ దేవి తండ్రి దక్షుడు నిర్వహించిన ధక్షయజ్ఞానికి వెళ్లేందుకు పరమేశ్వరుడు అంగీకరించక పోగా భర్త మాట కాదని యజ్ఞాన్ని చూడటానికి వెళ్లిన పార్వతీదేవి తండ్రిచేతనే అవమానానికి గురి అవుతుంది. శ్మశానంలో ఎముకలు బూడిద మధ్య ఉండే పరమేశ్వరున్ని తక్కువ చేసి తండ్రి ధక్షుడు మాట్లాడటంతో పార్వతీదేవి భర్తను అవమానించాడని భావంతో యజ్ఞంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. దీంతో వీరభద్రుడి అవతారంలో పరమేశ్వరుడు ధక్షుడిని సంహరించడం జరుగుతుంది. ఇలా పురాణ కథనం ఆధారంగా చిత్తూరు శివారులోని స్మశానంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దక్షయజ్ఞం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దక్షప్రజాపతి మట్టి ప్రతిమను సంహరించాక ఆ మట్టి ప్రసాదం కోసం భక్త జనసందోహం ఎగబడింది.

కుప్పంలో కొరడా దెబ్బలు.. కుప్పంలోనూ మహాశివరాత్రి తర్వాత జరిగే జాతర కొరడా దెబ్బలకు కొదవ లేకుండా చేసింది. కుప్పం స్మశానకొల్లు ఉత్సవంలో ఆంకాళ పరమేశ్వరి అమ్మవారిని ఊరేగించి శ్మశానికి తీసుకొచ్చి మానవ అస్థికల మద్య మట్టిప్రతిమను తయారు చేసి మొక్కులు తీర్చుకునే భక్తులు వివిధ రకాల వేషాలతో దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి స్మశానకొల్లులో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు విరామం లేకుండా కొరడాదెబ్బలు తిన్నారు. కొరడా దెబ్బలతో దెయ్యాలు వదిలిపోతాయని భావించే భక్తులు బారులు తీరి కొరడాలు దెబ్బలు తిన్నారు. స్మశానంలో చేతులు జోడించి మరీ ముందుకు వచ్చి కొరడా దెబ్బల రుచి చూసారు.

సంతానప్రాప్తికి అన్నప్రసాదం.. ఎర్రావారిపాలెం మండలం తలకోనలో వెలసిన శ్రీసిద్ధేశ్వరుని ఆలయంలోనూ సిద్ద పూజ నిర్వహించాక అన్న ప్రసాదం సంతాన ప్రాప్తిని కలుగ చేస్తుందని భావించే భక్తజనం కిక్కిరిసి పోయింది. మహాశివరాత్రి రోజు జాగరణ చేసే భక్తులు తలకోన జలపాతం నీటితో స్నానం చేసి సంతానం కోసం సిద్ద పూజ ప్రసాదం పొందారు. మట్టికుండలో వండిన అన్న ప్రసాదాన్ని 14 ఏళ్లలోపు ఉన్న జంగమ దేవర్లు సంతానం కోసం వచ్చే మహిళల కొంగులో వేస్తే వారి కోరిక సిద్ధిస్తుందన్న విశ్వాసం వేలాది మందిని ఆలయానికి నడిపించింది. సిద్ధ పూజ ప్రసాదం కోసం ఎగబడేలా చేసింది. ఇక సంతానం మొక్కుకోసమే కాకుండా సిద్దపూజ కు నైవేద్యంగా పెట్టిన అన్నం తింటే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, చదువులు, కోరుకున్న కోర్కెలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసం తలకోన సిద్దేశ్వరుడి అన్నప్రసాదం ప్రాధాన్యతను పెంచింది.

– ఎంపీఆర్ రాజు, టీవీ9 తెలుగు, తిరుపతి.

Also read:

Mirchi High Rates: ఘాటెక్కిన పచ్చిమర్చి.. రేటు చూస్తే గుండె గుభేలే..!

Hyderabad: భాగ్యనగర వాసులకు ఇక ఢోకా లేనట్లే!.. అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేందుకు..

Viral Video: బైక్ రైడర్ అవతారమెత్తిన ముఖ్యమంతి.. రెడ్ జాకెట్, సన్‌ గ్గాసెస్‌తో రచ్చ.. వైరల్‌ అవుతున్న వీడియో..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu