Polavaram Project: నేడు కేంద్ర మంత్రి షెకావత్‌, సీఎం జగన్ పోలవరం పర్యటన.. ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన

Surya Kala

Surya Kala |

Updated on: Mar 04, 2022 | 6:53 AM

Polavaram Project: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్(Union Minister Gajendra Singh Shekhawat) పర్యటిస్తున్నారు. నేడు సీఎం వైఎస్‌ జగన్ (CM Jagan) తో కలిసి..

Polavaram Project: నేడు కేంద్ర మంత్రి షెకావత్‌, సీఎం జగన్ పోలవరం పర్యటన.. ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలన
Shekhawat, Cm Ys Jagan

Follow us on

Polavaram Project: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్(Union Minister Gajendra Singh Shekhawat) పర్యటిస్తున్నారు. నేడు సీఎం వైఎస్‌ జగన్ (CM Jagan) తో కలిసి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా జలశక్తి మంత్రి తన పర్యటనను ప్రారంభిస్తారని వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏపీ పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం విజయవాడ చేరుకున్న కేంద్ర మంత్రి…రాత్రి సీఎం తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.  ఈరోజు ఉదయం 9.15కి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్ ను పోలవరం పర్యటనకు బయలుదేరనున్నారు.

ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో సమావేశం కానున్నారు. 11.20 కి పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి లో నిర్వాసితులతో షెకావత్ మాట్లాడనున్నారు. అనంతరం  సీఎం జగన్ తో కలిసి కేంద్ర మంత్రి షెకావత్ మధ్యాహ్నం12.30 కు పోలవరం డ్యామ్‌ సైట్‌ చేరుకుని..  ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. . అనంతరం చేపల నిచ్చెన పనులు, గైడ్ బండ్ పనులను సందర్శిస్తారు. ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పనులపై మంత్రి చర్చించనున్నారు. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ డయా ఫ్రమ్‌ వాల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత పోలవరం పర్యటనను ముగించుకుని విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంత‌రం శుక్ర‌వారం రాత్రి ఆయ‌న ఢిల్లీ తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

Also Read:

దేశంలో ఎన్నికల తర్వాత పెట్రో ధరల మంట.. గ్యాస్ కూడా పెరుగుతుందా ? దీనిపై సామాన్యుల స్పందన ఏంటి ?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu