AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palnadu: ఆరున్నర కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేశాడు.. ఇంకో అర కిలోమీటర్ చేస్తే ముగుస్తుందనగా..

కోటప్పకొండ గిరి ప్రదక్షిణలో అపశృతి చోటు చేసుకుంది. ఓ భక్తుడు గిరిప్రదక్షిణ చేస్తుండగా ఛాతిలో నొప్పితో అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచాడు. ప్రతి పౌర్ణమికి కోటప్పకొండ గిరి ప్రదక్షిణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇవాళ గిరిప్రదక్షిణ చేస్తూ ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచాడు.

Palnadu: ఆరున్నర కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేశాడు.. ఇంకో అర కిలోమీటర్ చేస్తే ముగుస్తుందనగా..
Kotappakonda
T Nagaraju
| Edited By: |

Updated on: May 12, 2025 | 1:44 PM

Share

అరుణాచలం తర్వాత పల్నాడులోని కోటప్ప కొండ గిరి ప్రదక్షిణకు ప్రసిద్ది గాంచింది. త్రికూటమిపై పరమ శివుడు దక్షిణ మూర్తిగా కొలువై ఉండటంతో ఇక్కడ గిరి ప్రదక్షణతో పుణ్యఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. త్రికూటమి అంటే ఎటు వైపు నుండి చూసిన మూడు కొండలు కనిపిస్తాయి. ఇవి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపలుగా భక్తులు భావిస్తుంటారు. అందుకే ప్రతి పౌర్ణమి రోజున కోటప్ప కొండలో పెద్ద ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.

ఎప్పటి లాగే మే 12, సోమవారం కూడా తెల్లవారుజామునే గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. పురుషోత్తపట్నంకు చెందిన భక్త బృందం ఈ ప్రదక్షిణంలో పాల్గొన్నారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నప్రదక్షిణ పూర్తి చేయడానికి గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే పురుషోత్తపట్నంకు చెందిన ప్రసాద్ అనే యాభై ఏళ్ల వయసున్న భక్తుడు దాదాపు ఆరున్నర కిలోమీటర్ల దూరం పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత ఊపిరి అందకపోవడంతో ఒక్కసారిగా ఆగిపోయాడు. వెంటనే ఛాతి నొప్పతో భాదపడుతూ రోడ్డుపై పడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన తోటి భక్తులు వెంటనే ప్రసాద్‌కు సిపిఆర్ చేశారు. అతన్నిసేవ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి ప్రసాద్ మృతి చెందాడు. గుండెపోటుతో ప్రసాద్ చనిపోయినట్లు భక్తులు భావిస్తున్నారు. ప్రసాద్ మృతితో తోటి భక్తుల్లో విషాయ ఛాయలు అలముకున్నాయి.

అనారోగ్యంతో ఉన్నా అలసటగా ఉన్నా గిరి ప్రదక్షణ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. యాభై ఏళ్లు పైబడిన భక్తులు బిపి, షుగర్ ఉంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకొని తర్వాతే ఉదయం లేదా సాయంత్రం మాత్రమే ప్రదక్షిణ చేయాలంటూ సూచించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఆగకుండా ఒకేసారి గిరిప్రదక్షిణ పూర్తి చేయకూడదంటున్నారు డాక్టర్లు. తగిన జాగ్రత్తలతో గిరి ప్రదక్షిణ చేయవచ్చని అయితే మొండిగా ముందుకెళ్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు మండే ఎండలు ఉండటంతో.. అప్రమత్తత చాలా అవసరం అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి