Devaragattu Bunny Festival: ఖాకీల వ్యూహం కర్రల యుద్ధాన్ని కట్టడి చేస్తుందా..? దేవరగట్టు బన్నీ ఉత్సవంపై టెన్షన్.. టెన్షన్..
Devaragattu Bunny Festival: దసరా ముగిసింది. దేవరగట్టు యుద్ధానికి తెరలేచింది. మాల మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవానికి సిర్వం సిద్ధం. మరి ఈసారైనా ఖాకీల వ్యూహం కర్రల యుద్ధాన్ని కట్టడి చేస్తుందా? ఓవైపు కర్రలకు రింగులు పడుతున్నాయి. మరోవైపు ఖాకీల నిఘా పెరిగింది. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. అర్ధరాత్రి నుంచి ఇక హైవోల్టేజీనే..

Devaragattu Bunny Festival: దసరా ముగిసింది. దేవరగట్టు యుద్ధానికి తెరలేచింది. మాల మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవానికి సిర్వం సిద్ధం. మరి ఈసారైనా ఖాకీల వ్యూహం కర్రల యుద్ధాన్ని కట్టడి చేస్తుందా? ఓవైపు కర్రలకు రింగులు పడుతున్నాయి. మరోవైపు ఖాకీల నిఘా పెరిగింది. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. అర్ధరాత్రి నుంచి ఇక హైవోల్టేజీనే.. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై కొలవైన మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో చరిత్ర వుంది. దసరా తరువాత స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తోంది.కొన్ని ఏళ్లుగా దేవరగట్టు లో జరిగే బన్నీ ఉత్సవానికి ఈ కొట్లాటల వల్లే కర్రల సమరం గా పేరు వచ్చింది. ఇది సమరం కాదు. సంప్రదాయం అంటారు భక్తులు.
బన్నీ ఉత్సవాలుకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు దీక్షలు చేపడతారు. ఉత్సవాలు ముగిసే వరకు చాలా నిష్టతో వుంటారు. మాలమల్లేశ్వరీ స్వామి కల్యాణోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను తరలించే క్రమంలో కర్రల సమరానికి తెరలేస్తోంది. మూడు గ్రామాల ప్రజలు.. ఇతర గ్రామాల నుంచే వచ్చే భక్తులు వర్గాలు విడిపోయి కర్రలతో సమరానికి దిగుతారు.ఉత్సవ విగ్రహాలు సింహాసనం కట్ట వద్దకు చేరుకున్న తర్వాత బన్నీ ఉత్సవం ముగుస్తుంది..అప్పటిదాక హైటెన్షనే.
ఉత్సవ మూర్తులను తాకే క్రమంలో భక్తులు రెండు వర్గాలు విడిపోవడం కట్టుకోవడం జరుగుతుంది. ఐతే మాములు కర్రలతో కాదు.. కర్రలకు ఐరన్ రింగులను బిగించి వాటితో విరుచుకుపడుతారు. ఎవరికి ఎవరిపై కోపం ఉండదు. ఆవేశమూ కాదు. బన్నీ ఉత్సవంలో కర్రల సమరం ఆనవాయితీలో భాగం అంటారు. ఐతే ఎంతోమందికి గాయాలవుతుంటాయి. ఈ క్రమంలో పోలీసులు కర్రల సమరాన్ని కట్టడి చేయాలని ఎప్పటి నుంచో దృష్టి పెట్టారు. కర్రలకు రింగులు వాడొద్దని ఆదేశించారు. నిఘాను ముమ్మరం చేశారు.
మాల మల్లేశ్వరస్వామి దసరా ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. 2000 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తారు. 100 మంది రెవెన్యూ ,100 మంది విద్యుత్ శాఖ సిబ్బంది 100 మందు వైద్య ఆరోగ్య సిబ్బంది వారి తో పాటు గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది కూడా విధులు నిర్వహించండం జరుగుతుంది..గాయపడ్డ భక్తుల చికిత్స కోసం 100 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అంబులెన్సులను సిద్ధం చేశారు.
దేవరగట్టు మాల సహిత మల్లేశ్వరస్వామి ఆలయ చరిత్ర కు చాలా ప్రాధాన్యత ఉంది. దేవరగట్టు అటవీ ప్రాంతంలో సముద్ర మట్టనికి సుమారు 2000 వేల అడుగుల ఎత్తేన కొండ గుహలో మాలమ్మ గా పార్వతి దేవి.. మల్లేశ్వరుడుగా శివుడు స్వయంభువుగా వెలిశారని చారిత్రక నేపథ్యం. బన్నీ ఉత్సవంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..