AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narayanaswamy: ఎస్సీ ఎమ్మెల్యేలకు అవమానం జరిగితే పట్టించుకోరా? సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డ డిప్యూటీ సీఎం

తాజాగా గడపగడప కార్యక్రమంలో గ్రామాలకు ఎస్సీ ఎమ్మెల్యేలు వెళ్లితే స్థానికులు అవమానిస్తున్నారని కోప్పడ్డారు నారాయణస్వామి. ఎస్సీ ఎమ్మెల్యేలు వస్తున్నారని ముందుగానే తెలుసుకుని కావాలనే కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఇళ్లకు తాళాలు వేయించడం వెనుక చంద్రబాబు ఉన్నారనేది నారాయణస్వామి ఆరోపణ

Narayanaswamy: ఎస్సీ ఎమ్మెల్యేలకు అవమానం జరిగితే పట్టించుకోరా? సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డ డిప్యూటీ సీఎం
Deputy Cm Narayanaswamy
Basha Shek
|

Updated on: May 28, 2023 | 12:13 PM

Share

ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రత్యేకం. ఆయనకు సంతోషమొచ్చినా.. కష్టమొచ్చినా టక్కున బయట పడిపోతారు. అస్సలు దాచుకోరు. ఈ తీరు వల్లే చాలాసార్లు చర్చల్లోకి వచ్చారు నారాయణస్వామి. తాజాగా గడపగడప కార్యక్రమంలో గ్రామాలకు ఎస్సీ ఎమ్మెల్యేలు వెళ్లితే స్థానికులు అవమానిస్తున్నారని కోప్పడ్డారు నారాయణస్వామి. ఎస్సీ ఎమ్మెల్యేలు వస్తున్నారని ముందుగానే తెలుసుకుని కావాలనే కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఇళ్లకు తాళాలు వేయించడం వెనుక చంద్రబాబు ఉన్నారనేది నారాయణస్వామి ఆరోపణ. చంద్రబాబు తన సామాజికవర్గం వాళ్లకు చెప్పి ఇళ్లకు తాళాలు వేయించి ఎస్సీ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఫైర్‌ అయ్యారు డిప్యూటీ సీఎం. తనకే కాదు.. జిల్లాలో మరికొందరు ఎస్సీ ఎమ్మెల్యేలకు ఇదే విధంగా అవమానాలు ఎదురైనా.. వైసీపీ ముఖ్య నేతలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ‘వైసీపీ నేతల వైఖరి మా దురదృష్టం, దౌర్భాగ్యం. ఎస్సీ ఎమ్మెల్యేలు వెళితే ఇళ్లకు తాళాలు వేయడం చంద్రబాబు పనే. నాకు ఇతర ఎస్సీ ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై.. వైసీపీ ముఖ్య నేతలు స్పందించడం లేదు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నారాయణ స్వామి. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నారాయణ స్వామి ఇటీవల గంగాధర నెల్లూరు మండలం పాచిగుంట గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ డిప్యూటీ సీఎంకు తాళాలు వేసిన ఇల్లు దర్శనమిచ్చాయి. నారాయణ స్వామి వస్తున్న విషయం తెలుసుకొని ఇళ్లకు తాళాలు వేసి జనం వెళ్లిపోయారు. ఊరంతా ఖాళీ అవ్వడంతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి అసహనానికి గురయ్యారు. సర్పంచ్ తో పాటు గ్రామంలో ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్న ఇళ్లలో జనం ఎందుకులేరని డిప్యూటీ సిఎం అధికారులను ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..