Andhra Pradesh: రెండో రోజు మహానాడుకు భారీ ఏర్పాట్లు.. సాయంత్రం భారీ బహిరంగ సభ.
రాజమండ్రి పసుపు మయంగా మారింది. ఇవాళ రెండో రోజు టీడీపీ మహానాడు జరగనుంది. తొలిరోజు శనివారం ప్రతినిధుల సభ జరిగింది. ఈరోజు సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రెండో రోజు మహానాడు బహిరంగ సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సుమారు 15లక్షల మంది కార్యకర్తలు...
రాజమండ్రి పసుపు మయంగా మారింది. ఇవాళ రెండో రోజు టీడీపీ మహానాడు జరగనుంది. తొలిరోజు శనివారం ప్రతినిధుల సభ జరిగింది. ఈరోజు సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. రెండో రోజు మహానాడు బహిరంగ సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సుమారు 15లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు వస్తారని అంచనా. ఇందుకు తగినవిధంగా సభాప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ శత దినోత్సవం, ఎన్నికల ముందు మహానాడు కావడంతో తెలుగు తమ్ముళ్లు నూతన ఉత్సాహంతో సభకు భారీ సంఖ్యలో హాజరవుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని మోగించనున్నారు. సంక్షేమం అభివృద్ధి పెంచే దిశగా తొలి మేనిఫెస్టోను చంద్రబాబు ఈ బహిరంగ సభలో విడుదల చేయనున్నారు. ఎన్నికలకు ముందు జరగుతున్న ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రసంగం కీలకంగా మారనుంది.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో జరగబోయేది కురుక్షేత్ర సమరమని.. వైసీపీ కౌరవసేనను ఓడిద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయో ఎన్నికలకు నియోజకవర్గాల వారిగా ఇప్పటికే కోట్ల రూపాయలను వైసీపీ నేతలు తరలించారని ఆరోపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మహానాడు ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..