AP News: మీటర్ పెరుగుతోంది.. ఇక చెమటలు కక్కాల్సిందే.. 3 రోజుల వాతావరణం ఇలా
ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పొద్దున్న వేడి.. రాత్రి చలితో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 3 రోజులు ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది.. వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా..

దిగువ ట్రోపోఆవరణంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో పడమటి, వాయువ్య దిశగా.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. అటు రాష్ట్రంలోనూ పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌లు ఎక్కువగానే నమోదయ్యాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ వచ్చే 3 రోజులు పలు కీలక సూచనలు అందించారు.
—————————————- రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ————————————
ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–
ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రాయలసీమ :- —————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి