Purandeswari: ఇకపై అలా ఉండదు.. పవన్ కల్యాణ్‌తో మాట్లాడతా.. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..

| Edited By: Shaik Madar Saheb

Jul 19, 2023 | 2:02 PM

Purandeswari - Pawan Kalyan: నాకు ఢిల్లీ పెద్దలు తప్ప.. రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌తో పెద్దగా సంబంధాలు లేవ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దేప‌దే చెబుతుంటారు. అంతేకాదు బీజేపీ-జ‌న‌సేన క‌లిసి రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొన‌లేదు.

Purandeswari: ఇకపై అలా ఉండదు.. పవన్ కల్యాణ్‌తో మాట్లాడతా.. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
Purandeswari, Pawan Kalyan
Follow us on

Purandeswari – Pawan Kalyan: నాకు ఢిల్లీ పెద్దలు తప్ప.. రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌తో పెద్దగా సంబంధాలు లేవ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దేప‌దే చెబుతుంటారు. అంతేకాదు బీజేపీ-జ‌న‌సేన క‌లిసి రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొన‌లేదు. ఒక్క తిరుప‌తి ఉపఎన్నిక‌ల్లో తప్ప.. ఆ త‌ర్వాత రెండు పార్టీలు క‌లిసి నిర్వహించిన కార్యక్రమాలు కూడా లేవు. కానీ ఇక‌పై అలా ఉండ‌దు అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. జ‌న‌సేన త‌మ‌కు మిత్రపక్షమని.. ఆపార్టీతో ఇక‌పై రెగ్యుల‌ర్ గా సంప్రదింపులు, ఉమ్మడి కార్యాచ‌ర‌ణ కూడా ఉంటుంద‌ని పురంధేశ్వరి స్పష్టంచేశారు. ఏపీ బీజేపీ చీఫ్ గా ఇప్పటికే బాధ్యతలు చేప‌ట్టిన త‌ర్వాత.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడాన‌ని చెప్పిన పురంధేశ్వరి.. త్వరంలో నేరుగా భేటీ అవుతాన‌ని అన్నారు. అయితే, ప్రభుత్వంపై పోరాటాల విష‌యంలో ఎవ‌రికి వారు విడివిడిగా ఉద్యమాలు చేసినప్పటికీ.. స‌మయానుసారం క‌లిసి ముందుకెళ్తామ‌న్నారు. వేర్వేరుగా ప్రజా ఉద్యమాల ద్వారా పార్టీలు బ‌లోపేతం చేసుకోవ‌ల్సి ఉంద‌న్నారు.

అటు టీడీపీకి వైసీపీకి స‌మ‌దూరంలో త‌మ పార్టీ ఉంటుంద‌ని.. జ‌న‌సేన‌తో మాత్రం పొత్తు కొన‌సాగుతుంద‌ని చెప్పుకొచ్చారు.. టీడీపీతో పొత్తుపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యలపై పురంధేశ్వరి స్పందించారు. పొత్తుల విష‌యం బీజేపీ అధిష్టానం చూసుకుంటుంద‌ని తెలిపారు. బాధ్యత‌లు చేప‌ట్టిన మొద‌టి రోజు నుంచే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పురంధేశ్వరి.. ఏపీలో బీజేపీ బ‌ల‌మైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంద‌ని అన్నారు.

ఇప్పటికే ప‌వ‌న్ ఢిల్లీ పెద్దల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. రాష్ట్ర ప‌రిస్థితిని బీజేపీ ఢిల్లీ పెద్దల‌కు వివ‌రిస్తున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత వీలైనంత త్వరగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసే ఆలోచ‌న‌లో ఉన్నారు పురంధేశ్వరి. ఇక‌నుంచైనా రెండు పార్టీలు క‌లిసి ముందుకెళ్తాయా లేక మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతాయా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..