AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Pandemic: నెల్లూరులో కోవిడ్ బాధితుల పట్ల టీవీ9 కథనం.. కదిలివచ్చిన పోలీసులు

ovid Pandemic: కరోనా మమమ్మారి మానవత్వాన్ని చంపేస్తోంది. సాటి మనిషి పట్ల దయ , కరుణ చూపడానికి చాలామందికి మనస్సు రావడం లేదు...

Covid Pandemic: నెల్లూరులో కోవిడ్ బాధితుల పట్ల  టీవీ9 కథనం.. కదిలివచ్చిన పోలీసులు
8
Surya Kala
|

Updated on: Apr 21, 2021 | 5:51 PM

Share

Covid Pandemic: కరోనా మమమ్మారి మానవత్వాన్ని చంపేస్తోంది. సాటి మనిషి పట్ల దయ , కరుణ చూపడానికి చాలామందికి మనస్సు రావడం లేదు. నెల్లూరులోని నవాబ్‌పేటలో జరిగిన అమానుష ఘటనను టీవీ9 వెలుగులోకి తెచ్చింది. టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు….బాధితులకు విముక్తి కల్పించారు.

తిండి కోసం ఆ దంపతులు అలమటించిపోతున్నారు. నిత్యావసర వస్తువులు, మందుల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి. తోటివాళ్లు సాయం చేయకపోగా ఇలా తాళం వేసి వేధించారని ఆ దంపతులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడికి నెగెటివ్‌ వచ్చిందని, పెరుగు తీసుకు రావడానికి మాత్రమే అప్పుడప్పుడు బయటకు వెళ్తున్నాడని బాధితుడి భార్య వెల్లడించారు. రాత్రి తన భర్తకు తీవ్రంగ దగ్గు రావడంతో మెడిసిన్‌ తీసుకురావడానికి ఎవరు లేకపోవడంతో తానే బయటకు వెళ్లి వచ్చేవాడని చెబుతున్నారు.

కనీసం కనికరం కూడా చూపని అపార్టుమెంటు వాసులు.. వారిపై ఇలా అమానుషంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ వారికి రేపు మిగతా వారికి కరోనా సోకదన్న గ్యారెంటీ లేదు కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంత మాత్రాన.. ఇంట్లో ఇబ్బంది పడేలా బయటి నుంచి తాళం వేయడం ఎంత వరకు సమంజసమని సామాన్య జనం నిలదీస్తున్నారు. కోవిడ్‌తో బాధపడే వారి పట్ల కనికరం చూపకున్నా పర్వాలేదు.. కానీ వారిని మరింత ఇబ్బంది పడేలా చేయడం సరికాదంటున్నారు.

కంటికి కనిపించని వైరస్‌తో ప్రపంచమే పోరాడుతుంటే.. సాటి మనుషులుగా జాలిచూపకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీవీ9 దృష్టికి ఈ దంపతుల అంశం రాకుంటే వారు మరింత కష్టాలు పడేవారు. ప్రాణాల మీదకే వచ్చేదేమో. ఆహారం లేక, మందులు వేసుకోలేక అవస్థలు పడుతున్న దంపతుల కష్టాలను టీవీ9 వెలుగులోకి తీసుకువచ్చింది. వారి కష్టాలకు కారణమైన అపార్టుమెంటు వాసుల అమానవీయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని తాళాలు తీశారు. వారికి ఆహారం, మందులు అందేలా చేశారు. టీవీ9కు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు.

Also Read: మొబైల్స్.పై కూడా కరోనా వైరస్.. స్మార్ట్ ఫోన్స్ ను సురక్షితంగా శుభ్రం చేసుకోవడం ఎలా అంటే..!