AP Corona: ఏపీలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే..!

Ap Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39,619 మంది శాంపిళ్లను...

AP Corona: ఏపీలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే..!
Ap curfew
Follow us

|

Updated on: Apr 21, 2021 | 6:43 PM

Ap Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39,619 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, అందులో కొత్తగా 9,716 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,86,703 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 7510 మంది మృతి చెందారు. ఇక కొత్త మరణాలు కృష్ణా జిల్లాలో 10 మంది, నెల్లూరులో ఏడుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు చొప్పున మొత్తం 38 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 3,359 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 918985 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 60,208 ఉన్నట్లు తెలిపింది. కాగా, కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. మాస్కులు ధరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరైన మాస్కులు ధరించకుండా బయట కనిపిస్తే వారికి జరిమానా విధిస్తున్నారు పోలీసులు. అలాగే భౌతిక దూరం పాటించని వారిపై కూడా చర్యలు చేపడుతున్నారు. కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వేగవంతం చేసింది ప్రభుత్వం.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కొత్త కేసులు

అనంతపురంలో- 849, చిత్తూరులో -1180, ఈస్ట్‌ గోదావరిలో – 830, గుంటూరు – 1236, వైఎస్సార కడప జిల్లా – 216, కృష్ణా – 294, కర్నూలు – 958, నెల్లూరు – 934, ప్రకాశం – 294, శ్రీకాకుళం – 1444, విశాఖ – 810, విజయనగరం – 565, వెస్ట్‌ గోదావరి – 106 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Ap Covid

Ap Covid

ఇవీ చదవండి: Migrant workers: మళ్లీ మొదలైన వలస కూలీల కష్టాలు.. ముల్లెమూట సర్దుకుని స్వస్థలాలకు పయనమవుతున్న వలస జీవులు

Corona Pandemic: భారత్ లో కరోనాతో మరణించిన భర్త.. చైనా నుంచి వీడియో కాల్ లో భార్య.. హృదయాన్ని కదిలించే పరిస్థితి!