AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం..! పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ..

Vijayawada Municipal Corporation : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కార్పొరేషన్ లోని

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం..!  పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ..
Vijayawada Municipal Corpor
uppula Raju
|

Updated on: Apr 16, 2021 | 9:38 AM

Share

Vijayawada Municipal Corporation : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్, విభాగంలో పలువురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తేలింది. నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్ సమావేశం జరగనుంది.ఇద్దరు కార్పొరేటర్లకు కోవిడ్ పాజిటివ్ రావడంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ముందస్తుగా కార్పొరేటర్లందరికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. రిజల్ట్ తర్వాత కౌన్సిల్ సమావేశం వాయిదా పై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,741 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,086 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ రాకాసి కోరలకు 14 మంది ప్రాణాలను వదిలారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు చనిపోయారు. అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది. ఇక, 24 గంటల వ్యవధిలో 1,745 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,03,072కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. మొత్తంగా చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,70,201 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Sanjana Ganesan- Jasprit Bumrah: వివాహమై నెల రోజులు పూర్తి… సోషల్ మీడియాలో బుమ్రాపై సంజన ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Priya Prakash Varrier: ”ఇష్క్” పైనే ఆశలు పెట్టుకున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్..

Flipkart: ట్రావెల్‌ బిజినెస్‌లో అడుగుపెట్టనున్న ఫ్లిప్‌కార్ట్… క్లియర్‌ట్రిప్‌లో వాటాలను కొనుగోలుపై చర్చలు