AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kathi Mahesh Death: మరణం చుట్టూ ముసిరిన ప్రశ్నలు.. ఫాదర్ అడిగిన క్వశ్చన్స్.. సురేష్ చెప్పిన ఆన్సర్స్..

అది..  జూన్ 26వ తేదీ అర్థరాత్రి నెల్లూరు వైపు కారు రయ్యన దూసుకుపోతోంది. పక్కనే నిద్రలో కత్తిమహేష్..డ్రైవింగ్ సీట్లో సురేష్. ఎదురుగా ఓ భారీ ట్రక్...

Kathi Mahesh Death: మరణం చుట్టూ ముసిరిన ప్రశ్నలు.. ఫాదర్ అడిగిన క్వశ్చన్స్.. సురేష్ చెప్పిన ఆన్సర్స్..
Kathi Mahesh
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2021 | 7:43 AM

Share

అది..  జూన్ 26వ తేదీ అర్థరాత్రి. నెల్లూరు వైపు కారు రయ్యన దూసుకుపోతోంది. పక్కనే నిద్రలో కత్తిమహేష్..డ్రైవింగ్ సీట్లో సురేష్. ఎదురుగా ఓ భారీ ట్రక్…ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే భారీ శబ్దం. సీన్ కట్ చేస్తే….కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవర్ సీటులో ఉన్న సురేష్‌కు స్వల్ప గాయాలు మినహా ప్రాణాపాయం లేదు..కారణం రెండు బెలూన్లు తెరుచుకోవడం…సీటు బెల్టు పెట్టుకోవడం. కానీ కత్తిమహేష్‌కు తీవ్రగాయాలు. సిట్యువేషన్ డేంజర్‌..కారణం.. ఒకటే బెలూను ఓపెన్‌ కావడం…సీటు బెల్టు పెట్టుకోకపోవడం…ఇదీ డ్రైవర్ సురేష్‌ పోలీసుల విచారణలో చెప్పిన విషయాలు.

ఇక్కడే కత్తిమహేష్ బంధువులకు అనుమానం వచ్చింది. కారు నుజ్జునుజ్జైనా సురేష్ స్వల్పగాయాలతో బయటపడటమేంటి…అన్న అనుమానం నుంచి పుట్టిన ప్రశ్నలు…కాస్తా కుట్రకోణం దాకా తీసుకెళ్లాయి. మరి మహేష్‌ మృతి వెనుక కారణమేంటి..ఇదే అన్వేషణలో ఉంది పోలీసు టీం, కానీ మహేష్ తండ్రి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో..కుట్ర ఆరోపణలకు మరింత బలం వచ్చింది. అసలు చనిపోయిన విషయం తమకు చెప్పలేదని.. దీనిపై న్యాయవిచారణ జరపాలంటున్నారు మహేష్ తండ్రి ఓబులేష్. ఇటు కత్తిమహేష్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంద కృష్ణమాదిగ సైతం మృతిపై డౌట్స్‌ రైజ్ చేయడంతో అందరిలోనూ ప్రమాదం కాస్త హత్యేనా అన్న అనుమానాలు బలపడ్డాయి..మహేష్‌ కేసులో సీరియస్‌నెస్ పెంచింది.

కత్తి మహేష్‌ను హత్య చేసేంత అవసరం ఎవరికుంది…?

గతంలో జరిగిన సంఘటనలు అతని మృతికి కారణమయ్యాయా..? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. అయితే ప్రమాదవశాత్తే చనిపోయాడని డ్రైవర్ సురేష్ గట్టిగా చెబుతున్నారు. ఇందులో ఎలాంటి విచారణకైనా సిద్ధమని….అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు.  ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది. డ్రైవర్ సురేష్‌ను ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు అడిగామని..కేసుకు సంబంధించి మరికొందరిని విచారించాలంటున్నారు కోవూరు సీఐ రామకృష్ణారెడ్డి.  15రోజులు చికిత్స తీసుకుని…ప్రాణాలొదిలిన మహేష్‌ మృతిపై ..రోజురోజుకూ అనుమానాలు పెరగడంతో పోలీసులు కూడా కేసు విచారణను మరింత స్పీడప్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చర్చ నడుస్తోంది.

Also Read:Andhrapradesh: ఆ జిల్లాల్లో పదునైన ఆయుధాలపై మరో 6 నెలలు నిషేధం పొడిగింపు

లిప్ లాక్ గురించి ప్రశ్నించిన నెటిజన్.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్