Collectors Conference: రెండు రోజులపాటు కలెక్టర్ల కాన్ఫెరెన్స్.. భవిష్యత్ దిశానిర్దేశం చేయనున్న సీఎం బాబు

ఆగస్ట్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశం ఈనెల 5వ తేది ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రెండో రోజు ఆరో తేదీ కలెక్టర్లతోపాటు పోలీస్ సూపరిండెంట్‌లను కలిపి అడ్రస్ చేయనుంది సర్కార్.

Collectors Conference: రెండు రోజులపాటు కలెక్టర్ల కాన్ఫెరెన్స్.. భవిష్యత్ దిశానిర్దేశం చేయనున్న సీఎం బాబు
Cm Chandrababu
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 01, 2024 | 9:16 PM

ఆగస్ట్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగనున్న ఈ సమావేశం ఈనెల 5వ తేది ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రెండో రోజు ఆరో తేదీ కలెక్టర్లతోపాటు పోలీస్ సూపరిండెంట్‌లను కలిపి అడ్రస్ చేయనుంది సర్కార్. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలు వివరించే ఈ కీలక సమావేశానికి కలెక్టర్లు, ఎస్పీలతో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కలెక్టర్లతో సమావేశం అవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు లక్ష్యాలను వివరించి వాటిని చేరేందుకు అవసరమైన మెకానిజంపై చర్చించే కీలక సమావేశం ఇది. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలన్న.. లబ్ధిదారులకు వాటిని సకాలంలో చెల్లించాలన్నా.. ప్రభుత్వ యంత్రాంగ పనితీరే కీలకం. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్లిప్తంగా, నిర్వీర్యంగా మారాయని భావిస్తున్న కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు అధికారుల్లో వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పదేపదే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్దేశాన్ని కూడా వెల్లడిస్తూ అధికారులు పనిచేయాల్సిన విధానాన్ని స్పష్టం చేయనుంది ప్రభుత్వం.

వివిధ శాఖల వారీగా సమీక్షలతో పాటు గత ప్రభుత్వ హయంలో జిల్లాల్లో భూములు, గనులు ఇసుక, సహజ వనరుల దోపిడీపైనా ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం సహజంగా ప్రాధాన్యాంశాలుగా తీసుకునే విద్య వైద్యం సంక్షేమం తో పాటు అభివృద్ధి కార్యక్రమాలలో అధికారుల పాత్ర పెరగాలని మరింత బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూటిగా చెప్పే అవకాశం కూడా ఉన్నట్టు అధికారి వర్గాలు చెబుతున్నాయి. ఆయా అంశాలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తమ వైఖరిని వెల్లడించనున్నారు సీఎం. రాష్ట్రంలో శాంతి భద్రతలపైనా ఫోకస్ చేయనున్నారు చంద్రబాబు. రెండో రోజు సమావేశంలో కలెక్టర్ల, ఎస్పీలతో జిల్లాల్లో శాంతి భద్రతలు, గంజాయి సాగు, అమ్మకాలపై కట్టడి వంటి అంశాలపై చర్చించి, భవిష్యత్ దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 50 రోజుల పూర్తి కావడం, ఇప్పటికే ఆయా ప్రభుత్వ విభాగాల ముఖ్య కార్యదర్శి తోపాటు విభాగాధిపతులు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు వరకు బదిలీలన్నీ దాదాపుగా పూర్తి కావడం.. పరిపాలన గాడిలో పడుతున్న క్రమంలో పాలనపై మరింత పట్టు బిగించే విధంగా చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేయబోతున్నారు. పథకాలలో కీలక పాత్ర లక్ష్యాలు సాధించాలన్న సరికొత్త విధానాలని అమలు చేయాలన్నా, ముందుకు రావాల్సింది ముందుగా కలెక్టర్‌లే. ఇలాంటి కీలకమైన ఈ సమావేశాన్ని మరింత ఉత్పాదకంగా ముందుకు తీసుకెళ్లాలన్న స్ట్రాటజీతో ముఖ్యమంత్రి సన్నద్దమవుతున్నట్టు సమాచారం.

ఇందుకు సంబంధించి ఈనెల 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా తెలిపారు. ఈమేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిసోడియా మాట్లాడుతూ జిల్లా కలక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు కలక్టర్లతో, రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 5వతేదీ ఉదయం 10గం.ల నుండి 11 గం.ల వరకూ కలెక్టర్ల సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండు రోజుల్లోను ఉదయం 10గం.ల నుండి సా.6గం.ల వరకూ కలెక్టర్ల సమావేశం ఉంటుందని స్పెషల్ సీఎస్ సిసోడియా పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ల సమావేశానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు స్పెషల్ సిఎస్ ఆర్‌పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈసమావేశానికి హాజరయ్యే కలెక్టర్లు, ఎస్పీలకు తగిన రవాణా, వసతి వంటి ఏర్పాట్లు చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనను ఆదేశించారు. అలాగే కలెక్టర్ల సమావేశం నిర్వహణకు అవసరమైన వివిధ సహాయ సిబ్బందిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. అదే విధంగా భద్రత,అగ్నిమాపక సంబంధిత భద్రతా చర్యలను గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, సచివాలయ ఎస్పీఎఫ్ అధికారులు చూడాలని చెప్పారు.

కలెక్టర్ల సమావేశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆహ్వానాలు పంపే ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా చెప్పారు. అదే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆడియో వీడియో సిస్టమ్, మీడియా కవరేజ్,మినిట్స్ రికార్డు వంటి అంశాలకు సంబంధించి ఐటి అండ్ సి, ప్రణాళిక, ఐ అండ్ పిఆర్, సిఆర్డిఏ విభాగాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సిసోడియా ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..