AP News: స్టూడెంట్‌ను చితకబాదిన ఆర్మీ కాలింగ్‌ సంస్థ నిర్వాహకుడు.. యాక్షన్‌లోకి నారా లోకేశ్

శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహకుల దారుణాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయింది. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ.. ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఏం జరిగింది?...

AP News: స్టూడెంట్‌ను చితకబాదిన ఆర్మీ కాలింగ్‌ సంస్థ నిర్వాహకుడు.. యాక్షన్‌లోకి నారా లోకేశ్
Man Beats Student
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 07, 2024 | 9:30 AM

శ్రీకాకుళం ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా.. ఆ సంస్థ డైరెక్టర్ వెంకటరమణ.. స్టూడెంట్లను బూతులు తిడుతూ కేబుల్ వైర్‌తో విచక్షణారహితంగా కొడుతున్న వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో దాడి వీడియోలు వైరల్‌ కావడంతో ఆర్మీ కాలింగ్‌ సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇండియన్ ఆర్మీ, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ జూపించి.. 5 నుంచి 10 లక్షల వరకూ ఆర్మీ కాలింగ్ సంస్థ వసూలు చేసింది ఆరోపించారు. జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించిన ఓ యువకుడిపై నిర్వాహకులు విచక్షణారహితంగా దాడి చేశారని మండిపడ్డారు.

ఈక్రమంలో.. స్టూడెంట్‌ను కొడుతున్న వీడియోకు మంత్రి నారా లోకేష్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఆర్మీ కాలింగ్ సంస్థ నిర్వాహకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో.. మంత్రి నారా లోకేష్‌ సీరియస్‌ అయ్యారు. కారణాలు ఏవైనా.. ఇలాంటి చర్యలు సరికాదన్నారు. చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన గతేడాది డిసెంబర్‌లో జరిగినట్లు తెలిపారు. ఇక.. ఆర్మీ కాలింగ్‌ ఇనిస్టిట్యూట్‌.. ఇంటర్మీడియట్ విద్యతో పాటు డిఫెన్స్‌లో చేరాలనుకునే విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. అయితే.. ఈ సంస్థపై గతంలోనూ పలు అభియోగాలు వచ్చాయి. లేడీస్ హాస్టల్ రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు దర్యాప్తు చేశారు. అటు.. ఆర్మీ కాలింగ్‌ సెంటర్‌కు ఇంటర్మీడియట్‌ కాలేజ్‌ అనుమతులు కూడా లేవని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్పడం ఆసక్తి రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?