YS Jagan: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. సీఎం జగన్ వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్..
ఇన్నాళ్ల కష్టం ఒక ఎత్తు.. ఇకపై ఆరునెలలు మరోఎత్తు.. చాలామంది సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇస్తాం.. టికెట్లు రానివాళ్లు కూడా నా వాళ్లే.. వాళ్లను మరోలా గౌరవిస్తాం.. సర్వేలు కొనసాగుతున్నాయి, ఇంకా కొనసాగుతాయి.. రాబోయే రెండు నెలలు మీ అందరికీ కీలకం.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. కష్టపడి పని చేయండి.. అంటూ వైఎస్ఆర్‌సీపీ, అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్ధేశం చేశారు.

ఇన్నాళ్ల కష్టం ఒక ఎత్తు.. ఇకపై ఆరునెలలు మరో ఎత్తు.. చాలామంది సిట్టింగ్‌లకు మళ్లీ టికెట్లు ఇస్తాం.. టికెట్లు రానివాళ్లు కూడా నా వాళ్లే.. వాళ్లను మరోలా గౌరవిస్తాం.. సర్వేలు కొనసాగుతున్నాయి.. ఇంకా కొనసాగుతాయి.. రాబోయే రెండు నెలలు మీ అందరికీ కీలకం.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. కష్టపడి పని చేయండి.. అంటూ వైఎస్ఆర్‌సీపీ, అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్ధేశం చేశారు. కీలక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు ఇక గేర్ మార్చాల్సిన సమయం వచ్చిందంటూ స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఇకపై దూకుడు పెంచాలని.. వచ్చే ఆరు నెలలు ఎలా పనిచేశామన్నదానిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని జగన్ తేల్చిచెప్పేశారు. కష్టపడి పనిచేస్తే 175కి 175 స్థానాలు సాధ్యమేనంటూ పేర్కొన్న సీఎం జగన్.. వై ఏపీ నీడ్స్ జగన్ పేరిట ముందుకెళ్లాలని పార్టీనేతలకు సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై నెలరోజుల పాటు ప్రచారం చేయాలని నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఇక త్వరలో టికెట్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో నేతలను ముందుగానే ప్రిపేర్ చేశారు జగన్‌మోహన్‌రెడ్డి.. కొంత మందికి టికెట్లు ఇవ్వలేనంటూ స్పష్టంచేశారు. టికెట్లు రాని నేతలు బాధపడకూడదని.. తనకు అందరూ ముఖ్యమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా పనిచేయాలి స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ మంగళవారం సమావేశం నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షతో పాటు, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై నేతలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే, సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. టికెట్లు రాని వారు బాధపడొద్దంటూ సీఎం జగన్ చెప్పడం వైసీపీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి టికెట్లు ఎవరికి దక్కవంటూ బేరీజు వేసుకుంటున్నారు. సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.. అయితే, ముందుగా కొంతమంది ఎమ్మెల్యేల రిపోర్ట్ వచ్చినట్లు ప్రచారం జరిగింది.. అదే జరిగితే.. దాదాపు 10 నుంచి 20కి పైగా స్థానాల్లో మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. జనంలో నేతలు ఎంతమేరకు తిరుగుతున్నారో సర్వేలు కూడా చేయిస్తున్నారు సీఎం జగన్.. ఈ నేపథ్యంలో తమకు సీటు దక్కకున్నా.. సముచిత స్థానం కల్పిస్తానన్న సీఎం జగన్ వ్యాఖ్యలను కూడా కొందరు పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో సీటు దక్కకపోతే.. నామినేటెడ్ పోస్టులైనా దక్కుతాయన్న ఆశలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలు ఫైనల్ స్టేజ్‌లో ఉండటంతో ప్రజల్లోకి వెళ్లి.. మళ్లీ మెప్పును పొందాలని కొందరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ మోదం.. ఎవరికీ ఖేదం .. త్వరలో సీఎం జగన్ ఏం తెలుస్తారనేది.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంకా విబేధాలున్న నియోజకవర్గాలపై కూడా జగన్ ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేలకు.. స్థానిక నేతలతో విబేధాలొద్దంటూ సూచించారు. అందరం ఒకటే కుటుంబమన్న జగన్.. నియోజకవర్గల్లో సమస్యలు ఆరునెలల్లో పరిష్కరించుకోవాలంటూ జగన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ విబేధాలు పరిష్కరించుకోకుండా.. అలానే ముందుకెళ్లే వారికి సీటివ్వడం కష్టమేనంటూ పార్టీ వర్గాల్లో ఊహగానాలు వినిపిస్తున్నాయి.
కొన్ని నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను మోటివేట్ చేయడం కోసం జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అంతకుముందు కూడా వైనాట్ 175 స్లోగన్ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు అదే నినాదాన్ని మరోసారి రిపీట్ చేయడంతోపాటు.. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ప్రజల్లోకి వెళ్లాలంటూ సూచించారు. అయితే, ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో.. భవిష్యత్తు ప్రణాళికకు అనుగుణంగా.. ఏపీలోని అధికారపార్టీ వైసీపీ పావులు కదుపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..