AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పోలీసులను చూసి పారిపోయిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. పెద్ద బండారమే బయటపడిందిగా..

విశాఖ అల్లూరి ఏజెన్సీలో మూడు కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి లక్ష నగదును, వాహనాన్ని సీజ్ చేశారు. పారిపోయిన మరో ఇద్దరు స్మగ్లర్ల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Andhra Pradesh: పోలీసులను చూసి పారిపోయిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. పెద్ద బండారమే బయటపడిందిగా..
AP Crime News
Shaik Madar Saheb
|

Updated on: Sep 27, 2023 | 1:14 PM

Share

ఏపీ ఏజెన్సీ గంజాయ్ గుప్పుమంటోంది. తాజాగా.. విశాఖ అల్లూరి ఏజెన్సీలో మూడు కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి లక్ష నగదును, వాహనాన్ని సీజ్ చేశారు. పారిపోయిన మరో ఇద్దరు స్మగ్లర్ల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. చింతపల్లి మండలం కుడుమసారి పంచాయతీ నిమ్మపాడు గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారు. అదే సమయంలో బొలెరో వాహనం దూకి మరొకరు పారిపోయారు. అప్రమత్తమైన పోలీసులు బొలెరో డ్రైవర్ను పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో 34 బస్తాల గంజాయి పట్టుబడింది. మొత్తం 1400 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఈ గంజాయి విలువ మార్కెట్లో మూడు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒరిస్సా దగుడుపల్లి నుండి ఈ గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. గంజాయిని తీసుకొని నర్సీపట్నం వైపు వెళ్ళటానికి ప్లాన్ చేశారు స్మగ్లర్లు. డ్రైవర్ ప్రసాద్‌, సీందరి చిన్నయ్య అనే ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. వీరి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, లక్ష రూపాయల నగదును, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కోరుకొండకు లోతుగెడ్డ బ్రిడ్జి దగ్గర గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వాహనాల తనిఖీలు నిర్వహించారు. పోలీసుల ఉనికిని గమనించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. బైక్‌పై వచ్చి అక్కడినుంచి పరారయ్యారు. వీరిద్దరూ పైలట్లుగా వ్యవహరిస్తున్నారు.. తదనంతరం, ఒక బొలెరో వాహనం ఆ ప్రదేశానికి చేరుకోగా.. పోలీసులను చూసి డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే చుట్టుముట్టిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని రాళ్లగెడ్డకు చెందిన సిందేరి చిన్నయ్య, కొత్తపాలెం పంచాయతీ భీమసింగి గ్రామానికి చెందిన కుడా ప్రసాద్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌లోని దాగుడుపల్లి గ్రామానికి చెందిన కిల్లో సత్తిబాబు నుంచి అక్రమాస్తులు కొనుగోలు చేసేందుకు సిందేరి చిన్నయ్య మధ్యవర్తిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. 1,400 కిలోల బరువున్న గంజాయిని కిలోకు రూ. 2000 చొప్పున కొనుగోలు చేసి.. ఒడిశా సరిహద్దు గ్రామానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్