ఆంధ్రప్రదేశ్ లో యువతను, ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్దమయింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్నయం మేరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటలపండుగకు స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను వెలికితీసి వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయసహకారాలు అందించాలనేది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. అందుకే ఆడుదాం ఆంధ్ర-ఇది అందరి ఆట పేరుతో భారీ కార్యక్రమం నిర్వహణకు సీఎం జగన్ నిర్నయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఆ తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఆటలపోటీలు జరగనున్నాయి. గెలుపొందిన విజేతలకు వివిధ స్థాయిల్లో నగదు ప్రోత్సహకాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కోసం ఇప్పటికే పోటీల నిర్వహణ కోసం క్రీడా స్థలాలను, స్టేడియంలను ఎంపిక చేసారు అధికారులు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి పదో తేదీ వరకూ వివిధ స్థాయిలో ఆటలపోటీలు జరగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆడుదాం ఆంధ్ర ద్వారా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 26 వ తేదీ నుంచి ఫిబ్రవరి పదో తేదీ వరకూ జరిగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరగనుంది. ఐదు క్రీడలకు సంబంధించి గ్రామ,వార్డు స్థాయిలో ముందుగా పోటీలు నిర్వహింనున్నారు. ఆడుదాం ఆంధ్ర కోసం కోటీ 23 లక్షల కోట్ల రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు అధికారులు చెప్పారు. 34.19 లక్షల మంది క్రీడాకారులు ఈ క్రీడా సంబరాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 15వేల4 గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖో పోటీలు జరగనున్నాయి. దీనికోసం 14,997 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,043 స్పోర్ట్స్ గ్రౌండ్స్ ను సిద్దం చేసారు. ఈ క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు అన్నింటినీ అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 2.99 లక్షల మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో లక్షా 50 వేల మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు మండల స్థాయిలో పోటీ పడతారు. మొత్తం 680 మండలాల్లో లక్షా 42 వేల మ్యాచ్ లు జరుగుతాయి. ఇక్కడ విజేవతలు నియోజకవర్గ స్థాయిలో బరిలో నిలుస్తారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 5250 మ్యాచ్ లకు పోటీలు జరుగుతాయి. నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు జిల్లా స్థాయిలో 26 జిల్లాల్లో జరిగే 312 మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంటుంది. ఇక చివరిగా జిల్లా స్థాయిలో గెలిచిన విజేతలు రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్ ల్లో పోటీ పడాల్సి ఉంటుంది. ఈనెల 26 వ తేదీ నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు జరగనున్నాయి. మండల స్థాయిలో జనవరి పదో తేదీ నుంచి 23వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో జనవరి 24వ తేదీ నుంచి 30 వ తేదీ వరకూ జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి పదో తేదీ వరకూ రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి.
ఆయా క్రీడల పోటీల్లో గెలుపొందిన విజేతలకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతులు అందించనున్నారు. ఒక్కో ఆటలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వనున్నారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ గేమ్స్‌లో రాష్ట్రస్ధాయిలో విజేతలకు ఫస్ట్ ప్రైజ్ 5లక్షలు, జిల్లా స్ధాయిలో 60వేలు, నియోజవర్గ స్ధాయిలో 35వేలు నగదు బహుమతి ఇవ్వనున్నారు. ద్వితీయ బహుమతి కింద రాష్ట్ర స్ధాయిలో 3 లక్షలు, జిల్లా స్ధాయిలో 30 వేలు, నియోజకవర్గస్ధాయిలో 15వేలు, తృతీయ బహుమతి కింద రాష్ట్రస్ధాయిలో 2లక్షలు, జిల్లా స్దాయిలో 10వేలు, నియోజకవర్గ స్ధాయిలో 5వేలు ఇస్తారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విజేతలకు రాష్ట్రస్ధాయిలో ఫస్ట్ ప్రైజ్ కింద 2లక్షలు, జిల్లాస్ధాయిలో 35వేలు, నియోజకవర్గస్ధాయిలో 25వేలు నగదు బహుమతి ఉంటుంది. ద్వితీయ బహుమతి రాష్ట్ర స్ధాయిలో లక్ష, జిల్లా స్ధాయిలో 20వేలు, నియోజకవర్గస్ధాయిలో 10 వేలు, తృతీయ బహుమతి కింద రాష్ట్రస్ధాయిలో 50వేలు, జిల్లా స్ధాయిలో 10వేలు, నియోజకవర్గస్ధాయిలో 5వేలు నగదు బహుమతి ఇవ్వనుంది ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..