AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Posani Krishna Murali: పోసానికి కీలక పదవి.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్.. కారణం అదేనా..

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ పోసాని కృష్ణ మురళికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసానిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి...

Posani Krishna Murali: పోసానికి కీలక పదవి.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్.. కారణం అదేనా..
Posani Krishna Murali
Ganesh Mudavath
|

Updated on: Nov 03, 2022 | 3:43 PM

Share

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ పోసాని కృష్ణ మురళికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసానిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారిక ఆర్డర్స్ విడుదల చేశారు. కొన్నేళ్లుగా పోసాని కృష్ణ మురళి వైసీపీ లోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. అలాగే జనసేన పార్టీ పై విమర్శలు చేయడంలోనూ పోసాని కృష్ణ మురళి సక్సెస్ అయ్యారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ పోసాని కృష్ణ మురళికి ఈ ఆఫర్ ఇచ్చినట్లు రాజకీయాల విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా.. గతంలోనూ ప్రముఖ హాస్య నటుడు అలీకి కీలక పదవి అప్పగించారు. అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ అప్పట్లో ఆదేశాలు విడుదల అయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన అలీకి అప్పట్లో రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కుదరలేదు. కాగా.. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగనున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే అలీ పోటీ చేయాలని భావించారు. కానీ అప్పట్లో సీట్లు సర్దుబాటు కాలేదు. రెండేళ్ల పాటు పదవిలో ఉండబోతున్న అలీ 2024లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.